Friendship Day : ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చింది.. స్నేహితుల దినోత్సవ చరిత్ర ఇదే…!
ప్రధానాంశాలు:
Friendship Day : ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చింది.. స్నేహితుల దినోత్సవ చరిత్ర ఇదే...!
Friendship Day : ఈ రోజు స్నేహితుల దినోత్సవం. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే ను మనదేశంలో నిర్వహించుకుంటారు. ప్రపంచం మొత్తం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నప్పటికీ, దేశాన్ని బట్టి తేదీ మారవచ్చు. ఐక్యరాజ్యసమితి జూలై 30వ తేదీని ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించగా, మనదేశంలో మాత్రం ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.అయితే ఫ్రెండ్‌షిప్ డే ఆలోచనను 1958లో జాయిస్ హాల్ తొలిసారిగా అందించారు. జాయిస్ హాల్ హాల్‌మార్క్ కార్డ్‌ల స్థాపకుడు. స్నేహితుల మధ్య బంధాల ద్వారా ప్రేరణ పొందారు. ఆ తర్వాత స్నేహితులు తమ స్నేహాన్ని, ప్రేమను పంచుకోవడంతో పాటు జరుపుకోవాలనే ఆలోచన అతనికి వచ్చింది.
Friendship Day ఫ్రెండ్షిప్ డే చరిత్ర..
మిస్టర్ హాల్ ఆలోచనను ప్రజలు చాలా ఇష్టపడడంతో ఎక్కువ మంది ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకోవడం ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. ఫ్రెండ్‌షిప్ డే ప్రజలు, దేశాలు, సంస్కృతులు, విభిన్న వ్యక్తుల మధ్య ప్రేమ, శాంతిని సృష్టించడంలో సహాయపడుతుంది. మనుషుల మధ్య బంధానికి వారధిలా పనిచేస్తుంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జూలై 30న జరుపుకుంటారు. కానీ అమెరికా, ఇండియా లాంటి దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు.
ఈ రోజు స్నేహితుల ప్రాముఖ్యతను, మన జీవితంలో వారు పోషిస్తున్న విలువైన పాత్రను గౌరవిస్తుంది. అలాగే గుర్తిస్తుంది కూడా. బంధాలను బలోపేతం చేయడానికి, స్నేహాలు తీసుకువచ్చే ఆనందాన్ని జరుపుకోవడానికి ఒక అవకాశంగా ఈ ఫ్రెండ్షిప్ డే పనిచేస్తుంది. ఈ రోజున, ప్రజలు సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున తన స్నేహితులకు ఇష్టమైన సందేశాలను పంపుతారు. స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు. మన జీవితాలను సుసంపన్నం చేసే సంబంధాలలో స్నేహితులు భాగమే. స్నేహ దినోత్సవం రోజు పసుపు గులాబీలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. పసుపు గులాబీలను స్నేహానికి గుర్తుగా అంతర్జాతీయంగా గుర్తిస్తారు.