garlic tea health benefits telugu
Garlic Tea : మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఆయుర్వేదం. ఆయుర్వేద మందులతో నయం కాని జబ్బేమీ ఉండదు. పూర్వపు రోజుల్లో ఆసుపత్రులు లేని సమయంలో.. ఆయుర్వేద మందులతోనే చాలామందిని బతికించేవారు. ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే రోగాలు జన్మలో కూడా మన దరి చేరవని పెద్దలు చెబుతుంటారు. అయితే.. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాన్ని కాదనుకోవడం వల్లనే.. ఇప్పుడు లేనిపోని రోగాలు వస్తున్నాయి. లేనిపోని వ్యాధులు వస్తున్నాయి.
garlic tea health benefits telugu
చాలామంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య షుగర్ వ్యాధి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరికి వస్తున్న వ్యాధి ఇది. దీన్నే మనం డయాబెటిస్ అని కూడా అంటాం. డయాబెటిస్ లో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా వచ్చేది టైప్ 2 డయాబెటిస్. దీన్ని అదుపులో ఉంచుకోకపోతే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. షుగర్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. కిడ్నీలు, గుండెపై ప్రభావం చూపుతుంది. అందుకే.. షుగర్ వ్యాధిని ఎప్పటికప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి. అయితే.. షుగర్ ను రోజూ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే.. మీరు రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు. వద్దన్నా కూడా షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
ఆయుర్వేదానికి ఎంత పవర్ ఉందంటే.. రోజూ ఒక కప్పు వెల్లుల్లి చాయ్ ని తాగితే.. షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుందట. వెల్లుల్లి లేదా ఎల్లిగడ్డ శరీరానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అందుకే నిత్యం మనం కూరల్లో వెల్లుల్లిని వేసుకుంటాం. వెల్లుల్లి క్లోమ గ్రంధిలో ఉండే బీటా కణాలను ఉత్తేజితం చేస్తుంది. దాని వల్ల శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే.. శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ ను కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావు. అందుకే.. వెల్లుల్లిని డైరెక్ట్ గా తినకుండా రోజూ చాయ్ రూపంలో తీసుకుంటే.. షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
వెల్లుల్లి చాయ్ ని చాలా సింపుల్ గా చేయొచ్చు. ఒక పాత్ర తీసుకొని.. దాంట్లో కాసిన్ని నీళ్లు పోసి.. బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిలో చిన్న అల్లం ముక్క వేయండి. అల్లాన్ని దంచి వేసినా పర్లేదు. ఇక.. తర్వాత వెల్లుల్లిని తీసుకొని.. వెల్లుల్లి రెబ్బలను బాగా నలపండి. నల్ల మిరియాల పొడిని కొంచెం తీసుకొండి. ఆ నీటిలో మెత్తగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, నల్ల మిరియాల పొడిని వేసి అలాగే కాసేపు ఉంచండి. ఆ తర్వాత నీళ్లు గోరు వెచ్చగా మారాక.. దాన్ని తాగేయండి. దాంట్లో కావాలంటే ఒక టీస్పూన్ తేనె కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.