ఛీ..ఛీ.. నడిరోడ్డుపై అమ్మాయిల రొమాన్స్.. పండగ పూట ఇదేం పని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఛీ..ఛీ.. నడిరోడ్డుపై అమ్మాయిల రొమాన్స్.. పండగ పూట ఇదేం పని..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,8:00 pm

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అయితే చేయకూడని దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారు. చాలా చిత్ర, విచిత్రమైన వీడియోలు చేసి నానా రచ్చ చేస్తున్నారు. ఏదో ఒకటి చేసేసి ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకోవడానికి ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి వారిని సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్స్ చేస్తున్నా సరే వారి ఆకృత్యాలు మాత్రం అస్సలు ఆపట్లేదనే చెప్పుకోవాలి.

ఇక మొన్న ఢిల్లీలో ఇద్దరు అమ్మాయిల వీడియో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఇద్దరు అమ్మాయిలు హోలీ పేరుతో నానా రచ్చ చేశారు. ఇద్దరు అమ్మాయిలు కింద కూర్చుని చేసిన రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అది చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. తాము ట్రైన్ లో ఉన్నామని.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని కూడా వారు ఆలోచించకుండా ఇలాంటి పని చేశారు. దాంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వచ్చింది. అయినా సరే ఆ ఇద్దరు అమ్మాయిలు అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు తాజాగా హోలీ నాడు వాళ్లకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోలీ పండుగ నాడు ఆ ఇద్దరు అమ్మాయిలు బైక్ పై రెచ్చిపోయాడు.

ముందు ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఇద్దరూ వెనకాల కూర్చుని రంగులు పూసుకుంటూ రొమాన్స్ చేశారు. మోహె రంగ్ లగా దే పాటకు ఇద్దరూ ఇలా రంగులు పూసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తించారు. కనీసం తాము నడిరోడ్డుపై ఉన్నామనే సోయి లేకుండా ఇలాంటి పనికి ఒడిగట్టారు. పండుగ పూట ఇలాంటి వీడియో చూసిన వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు అశ్లీలతను వ్యాపింపజేస్తున్నారని.. ఇలాంటి అమ్మాయిల వల్ల సమాజంలోకి బ్యాడ్ మెసేజ్ వెళ్తుందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది