Chicken : చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్లకు కొరకు చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు.. కొందరి ఇళ్లలోలైతే ముక్క లేకుండా ముద్ద దిగనే దిగదు.. అది వారంలో మటన్ తినాలంటే అందరూ కొనలేరు. అలాగని చేపలు తినాలన్న కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కావున చాలామంది బెస్ట్ ఆప్షన్ గా చికెన్ ని ఎంచుకుంటారు. ఆదివారం వస్తే చికెన్ షాప్ కి వెళ్లాల్సిందే.. అయితే గత 20 రోజులుగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటిన విషయం అందరికీ తెలిసిందే.. కేజీ స్కిన్లెస్ చికెన్ 320 రూపాయలుగా కొనుగోలు చేశారు. అటువంటి సమయంలో చాలామంది చికెన్ అంటే ఇష్టపడి తినేవాళ్లు ఎంతో బాధపడ్డారు. అటువంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెండు తెలుగు రాష్ట్రాలలో గత 20 రోజులుగా సమయంలో చికెన్ ధరలు బాగా పెరిగిపోయాయి.
కొంతమంది చికెన్ ధరలు చూసి మొత్తుకున్నారు. ఎందుకంటే వారాంతంలో ముక్క లేకుండా ముద్దమట్టని వారు చాలామంది ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్.. అదేంటంటే చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన ధరలు ప్రస్తుతం మరింత తగ్గాయి. తాజాగా తెలంగాణలో కిలో చికెన్ స్కిన్ లెస్ అయితే 200 నుంచి 210 రూపాయల వరకు నడుస్తోంది. స్కిన్ తో అయితే 180 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఇవే ధరలు నడుస్తున్నా యి. ఆ రెండు రోజుల నుంచి కిలో చికెన్ 300 పెట్టి కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు సంతోషపడుతున్నారు. చికెన్ ధరలు తగ్గడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కనపడడం లేదు. కోళ్ల లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు చికెన్ ధర భారీగా తగ్గింది. ఇక ముందు రోజులలో చికెన్ ధరలు పెరగవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎండలకి కోళ్లు చనిపోయే అవకాశాలు ఉంటాయి.
కావున కోళ్లు చనిపోవడం మొదలైతే చికెన్ ధరలు అమాంతం పెరుగుతాయని మళ్లీ 300 దాటినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరమే ఉండదు అనిదుకాణదారులు చెప్తున్నారు. ఇంకొక వైపు కోడి గుడ్డు ధరలు కూడా కిందికి దిగాయి. రెండు రోజుల వరకు ఒక్కో గుడ్డు 7 రూపాయల వరకు విక్రయించారు.రోజుకో కోడి గుడ్డు తినని ఆరోగ్య నిపుణులు చెప్పిన ఇంటిల్లపాది గుడ్డు కొనుక్కొని తింటే ధరలకు గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది. దాని నుంచి తెలుగు రాష్ట్ర ప్రజలుకు కాస్త ఊరట కలిగింది. ఇప్పుడు ఒక్కో గుడ్డు 6 నుంచి 6.50 పైసలు కు విక్రయిస్తున్నారు. హోల్సేల్ లో అయితే ఒక్క గుడ్డు ధర 5.50 నుంచి 6 రూపాయల వరకు నడుస్తోంది. ఈ ధరలు చూశాక ప్రజలు కాస్త మనసు స్థిమితంగా ఉంది. ఇక పోషకాహారం తీసుకోవడం మళ్ళీ మొదలుపెట్టారు..
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.