
Dhanashree Verma : నేను మీ అమ్మ, చెల్లి లాంటి దానిని అని మరవద్దు.. చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆగ్రహం..!
Dhanashree Verma : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై ఏ రేంజ్‌లో విమర్శలు జరుగున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.అయితే రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఆపేయాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నెటిజన్స్‌ని కోరింది. తమపై విద్వేశం చూపకుండా ప్రేమని పంచాలంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది. తాను అందరు అనుకున్నట్టు తప్పుడు మనిషిని కాదని చెప్పిన ధనశ్రీ, కుటుంబానికి తప్పక విలువలు ఇస్తానని పేర్కొంది. వివరాలలోకి వెళితే ధనశ్రీ ఇటీవల తన సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
తరచూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ అలరిస్తుంది.ఇటీవల డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్న ధనశ్రీ తన కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియా లో పంచుకుంది. దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి ట్రోలింగ్ రీఎదురైంది. ఆమెపై దారుణమైన కామెంట్స్ చేయడంతో ధనశ్రీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి ట్రోలర్స్‌కి గట్టి సమాధానం ఇచ్చింది. ట్రోల్స్ వలన తన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొంది. ట్రోల్స్ వలన తన ఫ్యామీలీ చాలా ప్రభావితం అవుతందని కూడా తెలియజేసింది.
ఇక ఈ ట్రోల్స్ వలన ధనశ్రీ కొంత కాలం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. నేను నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్స్, మీమ్స్ బారిన ఏ విషయంలో పడింది లేదు. అయితే ఈ సారి నేను చేసిన పని నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర ప్రభావితం చేసిందంటూ పేరం్కొంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది కాబట్టి దీనిపై స్పందిస్తారని ఆశిస్తున్నాను అని ధనశ్రీ పేర్కొంది. ఇక చాహల్ విషయానికి వస్తే ఒకప్పుడు అద్భుతమైన బౌలింగ్‌తో అలరించాడు.ఇప్పుడు అవకాశాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ధనశ్రీ 2014లో నవీ ముంబైలోని డీవై పాటిల్ కాలేజీ నుంచి డెంటిస్ట్రీ చదవగా, ఆ సమయమంలో ఆమె డాక్టర్ కాకుండా ఫిట్‌నెస్ ట్రైనర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2020లో చాహల్‌ని పెళ్లి చేసుకుంది ధనశ్రీ
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.