
best business in investment is low income is high
Good News : రీసెంట్‌గా కొన్ని బ్యాంక్స్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు తర్వాత.. బ్యాంకు ఆఫ్ బరోడా కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంకు ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 25, 2022 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఈ సవరణ తర్వాత.. బ్యాంకు ఆఫ్ బరోడా కొత్త వడ్డీ రేట్లు 2.80 శాతం నుంచి 5.25 శాతానికి మధ్యలో ఉన్నాయి. పదేళ్ల వరకు ఈ పరిమితి ఉండగా, అదనంగా 0.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది.దీంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకు ఆఫ్ బరోడా 7 రోజుల నుంచి 45 రోజుల వరకు మెచ్యూరిటీ అయ్యే ఎఫ్‌డీలపై 2.80 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. అలాగే 46 రోజుల నుంచి 180 రోజులకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు 3.7 శాతం వడ్డీని, 181 రోజుల నుంచి 270 రోజుల వరకు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లకు 4.30 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 271 రోజుల నుంచి ఏడాది వ్యవధిలోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.4 శాతంగా ఉంది.
Good News for Bank Customers in Inflated interest rates
ఇక సంవత్సరానికి 5 శాతం వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై అందిస్తూ ఉండగా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేవారికి 5.1 శాతం వడ్డీ ఇవ్వనున్నారు.ఇక మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి 5.25 శాతం వడ్డీ రేట్లను కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేయడం గమనార్హం. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా మూడేళ్ల కాల వ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లను ఆఫర్ చేసే బ్యాంకులలో బంధన్ బ్యాంకు, యెస్ బ్యాంకులున్నాయి. ఒకవేళ ఈ బ్యాంకులలో రూ.లక్షను డిపాజిట్ చేస్తే.. మీకు మూడేళ్లలో రూ.1.23 లక్షలు చేతికి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.