
EPFO decision on interest
EPFO Update : ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో)కు సంబంధించిన 7 కోట్ల మంది ఖాతాదారులకు ఈనెలాఖరులోగా వడ్డీ జమ చేయనున్నట్టు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈసారి 8.1శాతం పీఎఫ్ పై వడ్డీ లభించే అవకాశం ఉందని సమాచారం. గతేడాది కరోనా కారణంగా ఆలస్యమైన వడ్డీ ఈసారి త్వరగానే అకౌంట్లో జమ కానుంది. మొత్తంగా 72 వేల కోట్లు చెల్లించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. సాధారణంగా ఉద్యోగలు పీఎఫ్ పై వడ్డీని జమ చేసేందుకు గతేడాది 6 నుంచి 8 నెలల సమయం పట్టింది.
ఎందుకంటే కరోనా టైంలో ఉద్యోగులు సెలవులపై వెల్లడం, ప్రభుత్వ లావాదేవీలు కొన్ని బంద్ ఉండటమే కారణం. అందుకే ఈ ఏడాది త్వరగా వాహనదారుల అకౌంట్లోకి డబ్బు బదిలీ కానుందట. అయితే,ఈ ఏడాది వడ్డీ 40 ఏళ్ల కనిష్టానికి చేరుకుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈసారి వడ్డీ ఎలా జమచేయనున్నారంటే.. ఈ పీఎఫ్ ఖాతాలో ఒకవేళ రూ.10లక్షలు ఉంటే.. 8.1శాతం వడ్డీ కలిపితే మొత్తంగా రూ.81వేల వడ్డీ వస్తుంది. అదేవిధంగా రూ.7 లక్షల డబ్బులు ఉంటే వడ్డీ కింద రూ.56,700..ఒకవేళ రూ.5 లక్షలు ఉంటే రూ.40,500..కేవలం రూ.లక్ష మాత్రమే ఉంటే రూ.8100 వడ్డీ రానుంది.
Good news for EPFO customers
డబ్బులు అకౌంట్లో యాడ్ అయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అనంతరం ఈపీఎఫ్‌వో సందేశం ద్వారా పీఎఫ్ వివరాలను పొందవచ్చును. అయితే, దీనికంటే ముందు పీఎఫ్ ఖాతాదారులు మీ యూఏఎన్, పాన్, ఆధార్‌ను లింకప్ చేసుకోవాలి. ఇక ఆన్‌లైన్ ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేసి ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే passbook.epfindia.gov.inకి కొత్త పేజీ వస్తుంది. ఇందులో యూఏఎన్, పాస్ వర్డ్, క్యాప్చర్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.