Home » Andhra Pradesh » Good News For Women Business With 50 Thousand
andhra pradesh

Scheme for Womens : మహిళలకు గుడ్‌న్యూస్.. 50వేలతో బంపర్ బిజినెస్.. ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు..!

Authored By
Suma
The Telugu News | Published on: February 6, 2026, 9:00 pm
Advertisement

Scheme for Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Govt మహిళల Womens ఆర్థిక స్వావలంబనను పెంపొందించాలనే లక్ష్యంతో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించే భాగంగా మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునేలా “ఎగ్ మార్ట్‌ల” ఏర్పాటు కోసం ప్రత్యేక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు రోజువారీ ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా డ్వాక్రా DWCRA గ్రూపుల్లో ఉన్న మహిళలకు, ఒంటరి మహిళలకు ఈ పథకంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం ఎంపికైన లబ్ధిదారులకు సుమారు రూ.50 వేల విలువైన కార్ట్‌తో పాటు అవసరమైన అన్ని సామగ్రిని పూర్తిగా ఉచితంగా అందజేస్తోంది. దీంతో ప్రారంభ పెట్టుబడి భారం లేకుండా మహిళలు వ్యాపారం మొదలుపెట్టే అవకాశం లభిస్తోంది. ఈ కార్యక్రమం మహిళలను ఉద్యోగార్థులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తోంది.

Advertisement

Scheme for Womens : మహిళలకు గుడ్‌న్యూస్.. 50వేలతో బంపర్ బిజినెస్.. ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు..!

Scheme for Womens : ఎగ్ మార్ట్‌ల ఏర్పాటు, లాభాలు

ఈ పథకం కింద ఏర్పాటు చేసే ఎగ్ మార్ట్‌లలో Egg Mart ప్రధానంగా గుడ్ల విక్రయాలు చేపడతారు. గుడ్లు పోషకాహారంగా విస్తృతంగా వినియోగంలో ఉండటంతో పాటు డిమాండ్ ఎప్పటికీ ఉండే ఉత్పత్తి కావడం వల్ల మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశముంది. రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, కూడళ్లలో ఈ ఎగ్ మార్ట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని మెప్మా MEPMA మరియు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ NECC సంస్థలతో భాగస్వామ్యంగా అమలు చేస్తున్నారు. వీరి సహకారంతో వంట సామగ్రి, నిల్వ చేసే పరికరాలు, ఇతర అవసరాలను సమకూరుస్తున్నారు. గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు మహిళలకు నిత్య ఆదాయ మార్గాన్ని సృష్టించడం ఈ పథకం ప్రత్యేకత. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఈ ఎగ్ మార్ట్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

Advertisement

Scheme for Womens : దరఖాస్తు విధానం, శిక్షణ కార్యక్రమాలు

ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియను Application Process ప్రభుత్వం సులభంగా రూపొందించింది. ఆసక్తి ఉన్న మహిళలు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, బ్యాంకు ఖాతా వివరాలు, విద్యార్హతల సర్టిఫికెట్లతో పాటు వ్యాపార అనుభవం ఉన్నట్లయితే స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. మొత్తం 15 అంశాలపై సమ్మతి తెలపాల్సి ఉంటుంది. ఉత్పత్తి లేదా తయారీ రంగంలో అనుభవం ఉన్న మహిళలకు ఎంపికలో మరింత అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ముందుగా శిక్షణ అందజేస్తారు. వ్యాపార నిర్వహణ, ఖాతాల నిర్వహణ, ఆహార తయారీ పద్ధతులు, పరిశుభ్రత, వినియోగదారులతో వ్యవహరించే నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తైన తరువాతే కార్ట్ మరియు సామగ్రిని అందజేస్తారు. ఈ పథకం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా కుటుంబం మరియు సమాజంలో వారి స్థాయిని మెరుగుపరుస్తోంది. ఆసక్తి గల మహిళలు తమ సమీప మెప్మా కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల సాధికారతకు బలమైన పునాది వేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి