Home » News » Good News From Reliance Jio Jio Giving Extra Data Offers
News

Jio : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్… అధిక డేటాను అందించే బంపర్ ఆఫర్స్ ఇవే…

Authored By
aruna
The Telugu News | Published on: August 22, 2022, 7:00 am
Advertisement

Jio : టెలికాం కంపెనీగా గుర్తు తెచ్చుకున్న రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకర్షించడానికి రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తూ కస్టమర్లను మరింత ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అందుబాటులో ఉన్న టెలికాం సంస్థ ఇదే. కేవలం జియో రీఛార్జిల ద్వారానే కాదు స్మార్ట్ ఫోన్ లను కూడా ప్రవేశ పెడుతూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇకపోతే ఎక్కువగా వర్క్ ఫ్రం హోం పేరిట చేసేవారికి డేటా అవసరం ఎక్కువ ఉంటుంది. అలాంటివారు ఎక్కువ డేటాను అందించే రీచార్జ్ ప్లాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే అలాంటి వారి కోసం జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Advertisement

జియో అందిస్తున్న అధిక డేటా ప్లాన్స్ వివరాలు ఇవే. రూ.249 జియో ప్లాన్ కు 23 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లతోపాటు ప్రతిరోజు 2జీబీ డేటాను ఒకవేళ డైలీ డేటా లిమిట్ అయిపోగానే 64 కేబిపిఎస్ వేగంతో డేటాను మీరు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే జియో యాప్ లో సబ్స్క్రిప్షన్ తో అన్లిమిటెడ్ ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. రూ.299 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటా పొందవచ్చు. ఇక డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 64 కేబిపిఎస్ వేగంతో డేటాను వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు.

Good News From Reliance Jio, Jio Giving Extra Data Offers

Advertisement

అలాగే జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో సినిమాతో పాటు జియో యాప్ లన్నింటికీ కూడా ఫ్రీగా సభ్యత్వం పొందవచ్చు. రూ.533 జియో ప్లాన్ 56 రోజులు వాలిడితో ప్రతిరోజు 112 జీబీ డేటాను పొందవచ్చు. అంటే ప్రతిరోజు రెండు జీబీ డేటాను పొందే వీలుంటుంది. అదనంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ తో పాటు జియో యాప్ లో కూడా సభ్యత్వం పొందే అవకాశం ఇవ్వబడింది. జియో అందిస్తున్న ఈ అద్భుతమైన ప్లాన్ తో నిరంతరం డేటాను ఉపయోగించుకోవచ్చు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి