Great Women : ఒక్క రూపాయికే దోశ.. ఎక్కడంటే?

Advertisement

Great Women : ప్రస్తుతం రూ.500 నోటు పట్టుకుని మార్కెట్ కు వెళ్తే మనం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చే సరుకులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అనగా మార్కెట్ లో నిత్యావసరాల ధరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. కడుపు ఎలా నింపుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఓ తల్లి ఒక్క రూపాయికే టిఫన్ పెడుతోంది. ఎక్కడంటే..

Advertisement

ఏపీలోని అనంతపురం డిస్ట్రిక్ట్ తాడిపత్రి కాల్వగడ్డ వీధిలో సావిత్రమ్మ అనే వృద్ధురాలు ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తోంది. అలా అతి తక్కువ ధరకే టిఫిన్ అందిస్తూ జనం ఆకలి తీరుస్తోంది. స్థానికంగా ఉండే ప్రజానీకం ఈమె టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి దోశ తిని తమ ఆకలి తీర్చుకుంటున్నారు. అలా స్థానికంగా సావిత్రమ్మ బాగా ఫేమస్ అయింది కూడా.ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం..

Advertisement
great women supplying dosha for one rupee only
great women supplying dosha for one rupee only

Great Women : శభాష్.. సావిత్రమ్మ..

జరగగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ట్విట్టర్ వేదికగా సావిత్రమ్మను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. శభాష్..సావిత్రమ్మ అని పొగిడాడు. ఈ క్రమంలోనే ప్రజల ఆకలి తీరుస్తున్న సావిత్రమ్మను త్వరలో కలుస్తానని, సావిత్రమ్మకు ఏ అవసరం వచ్చినా వైసీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement