Kukatpally Sahasra Murder: బ్యాట్ కోసం..ప్రాణం తీసాడు
He died for a bat : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు చివరికి ఒక క్లూ ఆధారంగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు పక్కనే నివసిస్తున్న 15 ఏళ్ల బాలుడినే నిందితుడిగా గుర్తించారు. హత్య జరిపినట్టు ఆ బాలుడు తానే ఒప్పుకోవడంతో పాటు, పోలీసులు కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

Kukatpally Sahasra Murder update
సహస్ర తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘోర సంఘటన జరిగింది. హత్య చేసిన బాలుడు తరచూ క్రైమ్, హర్రర్ సినిమాలు చూసేవాడని, దొంగతనానికి ముందే ఒక పేపర్‌పై ప్లాన్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్లాన్‌లో గ్యాస్ పైప్ కట్ చేయడం, ఇంటి తాళం వేసి డబ్బు తీసుకెళ్లడం వంటి వివరాలు రాసి ఉన్నప్పటికీ, వాస్తవానికి అతను సహస్రను హత్య చేసి, హుండీ పగలగొట్టి డబ్బు తీసుకున్నాడని దర్యాప్తులో తేలింది. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తం అంటిన టీషర్ట్, ప్లాన్ రాసుకున్న పేపర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ కేసులో ఇంకా కొన్ని అనుమానాలు మిగిలే ఉన్నాయి. నిందితుడు రాసుకున్న ప్లాన్‌లో బ్యాట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ సహస్రను చూశాక భయంతో హత్య చేసినట్టు చెప్పడం పోలీసులకు అనుమానాస్పదంగా అనిపిస్తోంది. నిజంగా అతని ఉద్దేశ్యం దొంగతనమా? లేక ముందే హత్య చేయాలనే యోచనతో వచ్చాడా అన్న ప్రశ్నలు మిగిలిపోయాయి. పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు నిజం వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు బాలల మానసిక స్థితి, క్రైమ్ సినిమాల ప్రభావం వంటి అంశాలపై కూడా చర్చను రేకెత్తిస్తోంది.