Etela Rajender : ఈటలకు బిగ్ షాక్.. తన మంత్రి పదవి విషయంలో గవర్నర్ సంచలన నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Etela Rajender : ఈటలకు బిగ్ షాక్.. తన మంత్రి పదవి విషయంలో గవర్నర్ సంచలన నిర్ణయం

Etela Rajender : అనుకున్నదే జరిగింది… సీఎం కేసీఆర్ అందరూ ఊహించిందే చేశారు. ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని అంతా అనుకున్నట్టుగానే.. డైరెక్ట్ గా కాకుండా.. పొమ్మనకుండా.. సీఎం కేసీఆర్ పొగబెట్టేశారు. ఈటల రాజేందర్ చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. డైరెక్ట్ గా మంత్రి పదవి నుంచి రాజేందర్ ను తీసేయకుండా.. సీఎం కేసీఆర్ కు ఆ శాఖను బదిలీ చేశారు. నిన్నటి నుంచి మీడియాలో భూకబ్జాపై […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 May 2021,3:07 pm

Etela Rajender : అనుకున్నదే జరిగింది… సీఎం కేసీఆర్ అందరూ ఊహించిందే చేశారు. ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని అంతా అనుకున్నట్టుగానే.. డైరెక్ట్ గా కాకుండా.. పొమ్మనకుండా.. సీఎం కేసీఆర్ పొగబెట్టేశారు. ఈటల రాజేందర్ చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. డైరెక్ట్ గా మంత్రి పదవి నుంచి రాజేందర్ ను తీసేయకుండా.. సీఎం కేసీఆర్ కు ఆ శాఖను బదిలీ చేశారు.

health ministry transferred from etela rajender to cm kcr

health ministry transferred from etela rajender to cm kcr

నిన్నటి నుంచి మీడియాలో భూకబ్జాపై కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. 100 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని… మీడియాలో వార్తలు వచ్చాయి. కొందరు రైతులు కూడా దీనిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై సీరియస్ అయి వెంటనే విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న ఈటల వెంటనే ప్రెస్ మీట్ పెట్టి.. తను ఏ తప్పు చేయలేదన్నారు. తనపై విచారణ చేయాలని.. తప్పు ఉంటే వెంటనే ముక్కు నేలకు రాస్తా అన్నారు. ప్రభుత్వం కావాలని తనపై ముందస్తు ప్రణాళికతో తప్పుడు కథనాలను ప్రచారం చేయించిందని… తను ఏ భూమినీ లాక్కోలేదని.. కబ్జా చేయలేదని.. తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని ఈటల చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి గడ్డి పోచతో సమానం అని కూడా ఆయన చెప్పారు. తనకు ఆత్మ గౌరవం ముఖ్యమని… ఎన్ని సంస్థలతో విచారణ చేయించినా.. విచారణకు సహకరిస్తానని ఈటల చెప్పిన విషయం తెలిసిందే.

Etela Rajender : ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్య శాఖ కేసీఆర్ కు బదిలీ

ఓవైపు ఈటల భూకబ్జాపై మెదక్ జిల్లా అచ్చంపేటలో అధికారులు ఇవాళ ఉదయం నుంచి విచారణ చేపట్టారు. ఆ భూమిలో సర్వే కూడా చేస్తున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ విచారణ చేయిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక.. రిపోర్టు తయారు చేసి సీఎం కేసీఆర్ కు నివేదిక ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. అయితే.. ఓవైపు విచారణ జరుగుతుండగానే… మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్య మంత్రిత్వ శాఖకు సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన సీఎం సిఫార్సుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈటల రాజేందర్ చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్ చేతుల్లోకి వెళ్లింది.

health ministry transferred from etela rajender to cm kcr

health ministry transferred from etela rajender to cm kcr

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది