Home » Health » Health Tips For White Hair
Health

Health Tips | తెల్ల జ‌ట్టు స‌మ‌స్య‌నా.. అయితే ఈ ఫుడ్ దూరం పెట్టాల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: August 31, 2025 4:54 pm
Advertisement

Health Tips | ప్రస్తుతం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ఈ పరిస్థితి కేవలం జన్యుపరంగా మాత్రమే కాకుండా, జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కూడా కలుగుతోంది. నిపుణుల ప్రకారం కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు తరచుగా తీసుకోవడం వలన జుట్టు సహజ రంగును కోల్పోయి తెల్లబడుతుంది. ఇప్పుడు అలాంటి ప్రభావం చూపే ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.

Advertisement

#image_title

1. ఆల్కహాల్ & ప్రాసెస్డ్ ఫుడ్స్

Advertisement

ఆల్కహాల్‌ను అధికంగా సేవించడం వలన కేవలం ఆరోగ్యం కాకుండా జుట్టు రంగుపై కూడా ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ప్యాకింగ్ చేసిన, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పోషక లోపం ఏర్పడి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారే అవకాశాలు పెరుగుతాయి.

2. అధికంగా టీ & కాఫీ తీసుకోవడం

Advertisement

టీ, కాఫీలను రోజు అంతా అనేకసార్లు తాగే వారి శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందకపోవచ్చు. ఈ పానీయాల్లో ఉండే కెఫైన్ శరీరానికి జింక్, విటమిన్ B12 లాంటి ముఖ్యమైన పోషకాలను అబ్బోస్ప్ చేసుకోవడాన్ని అడ్డుకుంటుంది.

3. వేయించిన ఆహారాలు

చిప్స్, సమోసాలు, పకోడీలు లాంటి ఆయిల్ ఫుడ్స్‌ను తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్లు అందకపోతాయి. వీటిలో పోషకాలు తక్కువగా ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

4. అధికంగా ఉప్పు & చక్కెర

Advertisement

రుచి కోసం ఎక్కువగా తీసుకునే ఉప్పు, చక్కెరతో కూడిన ఆహార పదార్థాలు శరీరంలో హార్మోన్ సమతుల్యతను కుదిపేస్తాయి. దీని ప్రభావం జుట్టు వృద్ధిపై, రంగుపై పడుతుంది. క్రమంగా జుట్టు తెల్లగా మారుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, నట్‌లు, స్ప్రౌట్స్ వంటి ఆరోగ్యకర ఆహారాలు తీసుకోవాలి. నిద్ర తగినంత ఉండాలి.ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి