Home » News » Heavy Rainfall In Andhra Pradesh And Telangana
News

Weather Update | దసరా వేళ తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ధాటికి రెడ్ అలర్ట్ .. వాతావరణ శాఖ హెచ్చరికలు

Authored By
Sam C
The Telugu News | Published on: September 23, 2025, 12:00 pm
Advertisement

Weather Update | దసరా పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాలపై వరుణుడు అలుపెరగని వర్షాలతో దాడి చేస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తిమంతమైన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే తీవ్రమైన వర్షసూచనలతో సహా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది.

Advertisement

#image_title

ఆంధ్రప్రదేశ్‌లో అలర్ట్‌లు జారీ చేసిన జిల్లాలు

Advertisement

రెడ్ అలర్ట్ (భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక):

శ్రీకాకుళం

Advertisement

విజయనగరం

మన్యం అల్లూరి

విశాఖపట్నం

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.

Advertisement

ఆరెంజ్ అలర్ట్ (మోస్తరు వర్షాలు, పిడుగులు):

అనకాపల్లి

కాకినాడ

ఎల్లో అలర్ట్ (తేలికపాటి వర్షాలు, పిడుగుల అవకాశం):

Advertisement

ఎన్టీఆర్

ఏలూరు

తిరుపతి

నెల్లూరు

నంద్యాల

తెలంగాణలో వర్షాల తీవ్రత

తెలంగాణలో వచ్చే రెండు నుంచి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి