Chole Chaat Recipe : ఎంతో రుచికరమైన చోలే చార్ట్ సింపుల్ గా చేసుకోండి ఇలా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chole Chaat Recipe : ఎంతో రుచికరమైన చోలే చార్ట్ సింపుల్ గా చేసుకోండి ఇలా…

Chole Chaat Recipe : చోలే చానా అంటే చోలే శనగలు, కాబూలీ సెనగలు ఇలా కొన్ని పేర్లతో పిలుస్తారు. ఈ శనగలలో హై ప్రోటీన్ ,ఫైబర్ ,ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ శనగలు తినడం వలన పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే అరుగుదలకు, పెద్దప్రేగు శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది. ఇలాంటి శనగలు తినడం వలన పిల్లలు ఎంతో పుష్టిగా బలంగా ఉంటారు. ఇలాంటి ఈ శనగలతో చోలే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 July 2022,12:00 pm

Chole Chaat Recipe : చోలే చానా అంటే చోలే శనగలు, కాబూలీ సెనగలు ఇలా కొన్ని పేర్లతో పిలుస్తారు. ఈ శనగలలో హై ప్రోటీన్ ,ఫైబర్ ,ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ శనగలు తినడం వలన పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే అరుగుదలకు, పెద్దప్రేగు శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది. ఇలాంటి శనగలు తినడం వలన పిల్లలు ఎంతో పుష్టిగా బలంగా ఉంటారు. ఇలాంటి ఈ శనగలతో చోలే చాట్ చేసుకుందాం ఇలా.. దీనికి కావలసిన పదార్థాలు : చోలే శనగలు, చాట్ మసాలా, టమాటాలు, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, నూనె, సన్నని కారపూస, ఆయిల్ మొదలైనవి..

తయారీ విధానం: ఒక కప్పు చోలే శనగలు తీసుకొని 30 నిమిషాలు వీటిని నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి.ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అరకప్పు టమాట ముక్కలు సన్నవి వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి.

Here's how to make the very delicious Chole Chaat Recipe

Here’s how to make the very delicious Chole Chaat Recipe

తర్వాత దానిలో ఒక రెండు స్పూన్ల చాట్ మసాలా, ధనియా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు,వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాబోలి శనగలు దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ ని పోసుకొని పది నిమిషాలపాటు దగ్గరకయ్యలా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దింపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటూ దానిపైన కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన టమాట ముక్కలు సన్నని కారపూస పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.అంతే ఎంతో సింపుల్ గా చోలే చాట్ రెడీ.. వేడివేడిగా ఈ వర్షాకాలంలో తింటే ఎంతో బాగుంటుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది