YouTuber Jyoti Malhotra : యూట్యూబ్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్ స్పైగా ఎలా మారింది?
YouTuber Jyoti Malhotra : యూట్యూబ్ వేదికగా ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో దేశంలోని పర్యాటక ప్రదేశాలను పరిచయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్యానా యువతి జ్యోతి మల్హోత్రా.. ఇప్పుడు పాక్ గూఢచారిణిగా ఆరోపణలు ఎదుర్కొంటుండడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. యూట్యూబ్‌లో దాదాపు నాలుగు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఆమె, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలలోనూ భారీగా ఫాలోయింగ్ కలిగి ఉంది. మనాలి, కాశ్మీర్, జైపూర్ వంటి పర్యాటక ప్రదేశాల వీడియోలతో ప్రజల్లో పాపులర్ అయిన జ్యోతి, దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో ఇప్పుడు హెడ్ లైన్స్ లలో నిలిచింది.
దర్యాప్తు సంస్థల ఆధారాల ప్రకారం.. జ్యోతి గతంలో పాకిస్తాన్ హైకమిషన్ ఏర్పాటు చేసిన ఒక పార్టీకి హాజరైంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ పార్టీకి హాజరైన ఇతర భారతీయ కంటెంట్ క్రియేటర్లతో కలిసి ఆమె ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆమె పాక్ వెళ్లి అక్కడ కొంతమంది అనుమానాస్పద వ్యక్తులను కలవడం, వారి విధానాలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అంశాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి.

YouTuber Jyoti Malhotra : యూట్యూబ్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్ స్పైగా ఎలా మారింది?
జ్యోతిపై ప్రస్తుతం దేశవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నదన్న అనుమానంతో దర్యాప్తు జరుగుతోంది. ఆమె కు ఎవరితో సంబంధాలు ఉన్నాయి..? ఎలాంటి సమాచారాన్ని పంచుకుంది? దీనికి బదులుగా ఎలాంటి డబ్బు అందుకున్నదనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా మాత్రం.. ఆమెపై వచ్చిన ఆరోపణలు తమ కుటుంబానికి పెద్ద షాక్‌గా మారాయని తెలిపారు. కేవలం బ్లాగింగ్ పట్ల ఉన్న ఆసక్తితో ఆమె యూట్యూబ్ ప్రారంభించిందని, ఈ ఘటన ఇప్పుడు తమకు షాక్ ను కలిగిస్తుందని వాపోతున్నారు. మరి అధికారుల విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అనేది చూడాలి.