
how-dmart-cheat-us
DMart Cheating : డీమార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా డీమార్ట్ విస్తరిస్తోంది. అసలు డీమార్ట్ లోకి వెళ్తే కొంచెం కూడా స్పేస్ ఉండదు. సరుకులు తీసుకునే ప్లేస్ కూడా ఉండదు. బయట బండినో, కారునో పార్క్ చేసేంత ప్లేస్ కూడా ఉండదు. డీమార్ట్ అంటే జనాలు అంతలా ఎగబడతారు. ఇక ఆదివారం వస్తే జనాలు అస్సలు ఆగరు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జనాలే జనాలు. సరుకులన్నీ తీసుకొని వాటి బిల్ వేయించడానికే గంటలకు గంటలు లైన్ లో నిలబడాలి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా డీమార్ట్ లలో కనిపిస్తుంటారు. దానికి కారణం.. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీతో ఉండే సరుకులు.
బయట ధరకు కొనే సరుకుల్లో 50 శాతం వరకు డిస్కౌంట్ లో ఇస్తారు డీమార్ట్ లో. ఒక ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు డీమార్ట్ లో దొరుకుతాయి. అందుకే డీమార్ట్ కి జనాల తాకిడి పెరుగుతోంది. ఒకప్పుడు డీమార్ట్ అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉండేది. కానీ.. ఇప్పుడు డీమార్ట్ అంటే పట్టణాల్లోనూ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో స్టోర్స్ ను ఓపెన్ చేసింది డీమార్ట్. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, రెడీమెడ్ డ్రెస్సులు, సబ్సులు, గిన్నెలు, డ్రెస్సులు, కుక్కర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే డీమార్ట్ లో దొరకని వస్తువంటూ ఉండదు. అది కూడా బయట దొరికే రేట్ కంటే తక్కువ ధరకే దొరుకుతుండటంతో ఇక జనాలు కూడా డీమార్ట్ కి పరుగులు పెడుతున్నారు.
చాలామంది నెలకు సరిపోయే సరుకులను ఒకేసారి డీమార్ట్ లో తీసుకుంటూ ఉంటారు. డీమార్ట్ దెబ్బకు బిగ్ బజార్, మోర్ లాంటివే మూసేయాల్సి వచ్చింది. అయితే.. అసలు డీమార్ట్ కు ఎందుకు అంత క్రేజ్ వచ్చింది. అసలు డీమార్ట్ మనల్ని మోసం చేస్తుందా? అనేది తెలుసుకోవాలి.నిజానికి.. బయట దొరకే రేట్ కంటే డీమార్ట్ తక్కువ రేట్ కే ఇవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ గా మ్యానుఫాక్షరింగ్ సెంటర్ల నుంచే వస్తువులను కొని నేరుగా డీమార్ట్ కే తీసుకురావడం. ఇక్కడ మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు. ఒకేసారి భారత్ లోని అన్ని డీమార్ట్ సెంటర్లకు సరిపోయే వస్తువులను ఒకేసారి కంపెనీ మ్యానుఫాక్షరింగ్ యూనిట్ కే వెళ్లి బల్క్ లో కొనేస్తారన్నమాట. దాని వల్ల.. హోల్ సేల్ రేట్ కంటే కూడా ఇంకా తక్కువ ధరకే వాళ్లకు వస్తువులు లభిస్తాయి.
మామూలుగా ఆ వస్తువులు మార్కెట్ కి వచ్చేసరికి వేరే రేట్ ఉంటుంది. కానీ.. డీమార్ట్ కొనే రేటు చాలా తక్కువ. అందుకే.. ఆ వస్తువులకు బయటి రేట్ కంటే కూడా తక్కువ ధరకే డీమార్ట్ వినియోగదారులకు అందిస్తుంది. క్వాలిటీలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాదు డీమార్ట్.వీళ్ల టార్గెటే పేద, మధ్యతరగతి ప్రజలు. వీళ్లే అసలైన వినియోగదారులు అని నమ్మే డీమార్ట్.. వాళ్లకు కావాల్సిన అన్ని వస్తువులను భారీ డిస్కౌంట్ లలో అందించడం. మధ్య తరగతి ప్రజలు డిస్కౌంట్ అనగానే వెంటనే ఎగిరి గంతేస్తారు. అదే వాళ్ల వీక్ నెస్. ఆ వీక్ నెస్ నే క్యాష్ చేసుకున్నారు డీమార్ట్ యాజమాన్యం.
how-dmart-cheat-us
లాభాలు లేకున్నా పర్వాలేదు కానీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు వస్తువులను భారీ డిస్కౌంట్లతో అమ్మాలి. అలాగే.. డీమార్ట్ లో ఎక్కువ హంగామా ఏం ఉండదు. హడావుడి ఉండదు. ప్రకటనలు కూడా ఉండవు. వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులను ఇవ్వడం. అయితే.. తక్కువ ధరకే అందించే విషయంలో మాత్రం క్వాలిటీ గురించి కూడా ఆలోచించాలి. తక్కువ ధరకు అంటే కొన్ని వస్తువుల క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అయినా కూడా మధ్యతరగతి ప్రజల కోరికలను తీర్చడం కోసం తక్కువ ధరకే వస్తువులను అందించడం అనేది నిజంగా గొప్ప విషయం. అక్కడే డీమార్ట్ విజయం సాధించింది.
అలాగే.. డీమార్ట్ లో ఏ ప్రాడక్ట్ అమ్మాలన్నా.. ఆ కంపెనీ ఖచ్చితంగా డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. నేరుగా కంపెనీలతో మాట్లాడి బయటి వాళ్లకు ఇచ్చే డిస్కౌంట్ కంటే కూడా ఎక్కువ డిస్కౌంట్ తమకు ఇవ్వాలని చెబుతారు. అందుకే డీమార్ట్ లో ఏ వస్తువు మీద అయినా సరే ఖచ్చితంగా ఎంతో కొంత డిస్కౌంట్ లభిస్తుంది. అదే వినియోగదారులకు నచ్చింది. ఏ వస్తువు మీద అయినా సరే డిస్కౌంట్ లభిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ సరుకులు వస్తున్నాయి కాబట్టి జనాలు కూడా డీమార్ట్ కి వెళ్లడానికి ఎగబడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.