Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎగ్గు నూడిల్స్ ను ఈజీగా ఇంట్లో ఇలా చేయండి ….?
Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనగానే ముందుగా గుర్తోచ్చేది ఎగ్ నుడిల్స్ . ఈ నూడిల్స్ ను చైనిస్ వారు మనకు పరిచయం చెసారు . దినిని ప్రపంచ వ్యాప్తంగా మరియు మన దేశం వారు కూడా ఇష్టంగా తింటున్నారు . ఇవి చాలా రుచిగా ఉంటాయి . ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు . ఈ నూడిల్స్ లో ఎగ్గ్ చెర్చడం వలన ఇంకా రుచిగా ఉంటాయి. దినిలో వేసే మసాలాల వలన ఎగ్ నుడిల్స్ కు మంచి టేస్ట్ ను తెస్తాయి . కాని వీటిని మనం ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వేళ్ళి తింటుంటాము . బయటి నూడిల్స్ తినడం వలన డైజిషన్ ప్రాబులమ్స్ వస్తాయి . కాబట్టి విటిని ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోని తింటే హేల్త్ ప్రాబులమ్స్ ను కొంతవరకు తగ్గించుకొవచ్చు. మరి వీటిని తయారు చేసే విధానం తెలిస్తే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు.
వీటిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారి వీధానం ఈ క్రింద తెలియజేయడం జరిగింది. కావలసిన పదార్థాలు : 1) ఉడికించుకున్న నూడిల్స్ 2) 3-ఎగ్స్ 3) ఆయిల్ 4) ఆనియన్స్ 5) పచ్చిమిచ్చి 6) క్యాప్సికమ్ 7) క్యారెట్స్ 8) క్యాబెజీ 9) అల్లం వెల్లుల్లి పేస్ట్ 10) సోయా సాస్ 11) షజ్వాన్ సాస్ 12) సాల్ట్ 13) కారం 14) మిరియాల పౌడర్ 15) గరం మసాలా 16) ఉడికించుకున్న నూడిల్స్ 17) వాటర్ తయారీ విధానం : పస్ట్ వాటర్ తిసుకొని ఈ నూడిల్స్ ను ఉడికించుకోవాలి . ఉడికించిన నూడిల్స్ ను ఒక జల్లి గిన్నెలోకి వేసుకొని వెంటనే చల్లటి నీరును పోయాలి . ఆ తరువాత ఒక కడాయిని తిసుకొని అందులో కొంచెం ఆయిల్ ను తిసుకొని 3-ఎగ్స్ ని వెసుకోవాలి .
ఇవి మగ్గిన తరువాత ఆనియన్స్ , క్యాస్సికమ్ తురుము , క్యాబెజీ తురుము , క్యారెట్ తురుము , పచ్చిమిచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెసుకొవాలి . ఇవి ఫ్రై అయిన తరువాత ఒక `టీ `- స్ఫూన్ సాల్ట్ వెసుకోవాలి . ఒక `టీ `- స్ఫూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వెసుకొవాలి. సోయా సాస్ కొంచెం ,షజ్వాన్ సాస్ ఒక `టీ `- స్ఫూన్ ,కారం ఒక `టీ `- స్ఫూన్ , మిరియాల పౌడర్ అర `టీ `- స్ఫూన్ , గరం మసాలా చిటికెడు , ఇవన్ని ఫ్రై అయిన తరువాత లాస్ట్ లో ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ ను వేసుకొని భాగా కల్పుకోవాలి . కొంచ్చం మగ్గనివ్వాలి . అంతే టేస్టీ టేస్టీ , స్ఫైసీ స్ఫైసీ , యమ్మీ యమ్మీ ఎగ్ నూడిల్స్ రెడి . ఇంట్లోనే ఈజీగా ఇలా హేల్ధిగా తయారు చేసుకొవచ్చు . పూర్తి వివరణ కొరకు ఈ క్రింది వీడియోను చూడండి ..