how to cook Veg Manchurian Recipe in our home
Veg Manchurian Recipe : మనకు కాస్త ఖాళీ సమయం దొరికితే సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఈ మధ్య బయటకు వెళ్లగానే ఎక్కువగా కనబడేవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనగానే గుర్తొచ్చే వాటిల్లో ఒకటి వెజ్ మంచూరియా. దీనిని ఒకసారి తిన్నామంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అలా అని రోజు బయట తినలేం కదా. ఇంట్లో కూడా వెజ్ మంచూరియాని ఈజీగా చేసుకోవచ్చు.అది ఎలా తయారుచేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు: 1) ఆయిల్ 2) క్యాబేజి 3)క్యారెట్ 4)ఉల్లిపాయలు 5)పచ్చిమిర్చి 6)ఆలుగడ్డ 7)మైదా పిండి 8)కార్న్ ఫ్లోర్ 9)ఉప్పు 10)వెల్లుల్లి 11)అల్లం 12) పంచదార 13)సోయాసాస్ 14) చైనీస్ చిల్లీ పేస్ట్ 15)ఆరోమాటిక్ పౌడర్
తయారీ విధానం: ముందుగా ఒక మెత్తటి క్లాత్ తీసుకొని అందులో అరకప్పు క్యారెట్ తురుము, అరకప్పు క్యాబేజి తురుము వేసుకొని గట్టిగా నీరు పోయేలా పిండాలి. తర్వాత ఆ తురుములను ఒక గిన్నెలో తీసుకొని అందులో రెండు టేబుల్ స్ఫూన్ల కార్న్ ఫ్లోర్,రెండు టేబుల్ స్ఫూన్ల మైదా పిండి ,కొద్దిగా ఉప్పు,ఉడికిన ఆలుగడ్డను వేసి బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనంలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉండలుగా చేసుకున్న వాటిని వేసి ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
how to cook Veg Manchurian Recipe in our home
ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి,కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి.తరువాత సోయాసాస్.చైనీస్ చిల్లీ పేస్ట్, ఆరోమాటిక్ పౌడర్ ను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిని మంచూరియాలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ…మీకు మరింత వివరంగా కావాలంటే ఈ వీడియో లింక్ ను క్లిక్ చేయండి…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.