Proning : కరోనా సోకిందా? ఇంట్లోనే ఉంటూ ఆక్సిజన్ లేవల్స్ ను ఇలా పెంచుకోండి..!

Advertisement
Advertisement

Proning : ప్రస్తుతం దేశమంతా అతలాకుతలం అవుతోంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కరోనాతో జనాలు సతమతమవుతున్నారు. ఏ ఆసుపత్రి చూసినా కరోనా పేషెంట్లతో ఫుల్ అయిపోయింది. ఆక్సిజన్ సిలిండర్ల కొరత, బెడ్స్ ఫుల్, వెంటిలేటర్ల కొరత కరోనా రోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా వచ్చిన వాళ్లకు ఎక్కువ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరేవారే ఎక్కువగా ఉన్నారు. శ్వాసకు సంబంధించిన సమస్య వస్తే… వాళ్లకు ఖచ్చితంగా ఆక్సిజన్ అందించాలి. అందుకే ఆక్సిజన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

Advertisement

how to increase oxygen levels at home by using proning technique

ప్రస్తుతం కరోనా రోగులకు ఆక్సిజన్ అనేది చాలా అవసరం. కరోనా వైరస్ శరీరంలోకి వెళ్లాక ముందుగా అది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. దీంతో కరోనా వచ్చిన వాళ్లకు శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యలను అధిగమించేందుకు… కరోనా వచ్చినవాళ్లు ఆసుపత్రులకు వెంటనే పరిగెత్తుకురావాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి శ్వాసకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను జయించవచ్చని… ఎక్కువ ఆక్సిజన్ ను పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకోవడం కోసం ఈ ప్రక్రియను సూచించింది.

Advertisement

Proning : ప్రోనింగ్ అనే ప్రక్రియ ద్వారా శ్వాసను మెరుగుపరుచుకోవచ్చు

దాని కోసం కరోనా వచ్చిన వాళ్లు చేయాల్సిన పని ప్రోనింగ్ టెక్నిక్. ప్రోనింగ్ అంటే ఏం లేదు… ఒక పొజిషన్ లో పడుకొని ఊపిరి తీసుకోవడం అన్నమాట. అంటే… బొక్కబోర్లా పడుకోవడం. బొక్కబోర్లా పడుకోవడం వల్ల.. చాతి మీద, పొట్ట మీద పూర్తి భారం పడుతుంది. అప్పుడు శ్వాసను తీసుకుంటే… వెంటనే ఆ శ్వాస ఊపిరితిత్తులకు అందుతుంది. దాని వల్ల ఆక్సిజన్ లేవల్స్ పెరుగుతాయి. బొక్కబోర్లా పడుకునే వీలు లేని వాళ్లు.. ఒక పక్కకు కూడా పడుకొని శ్వాస తీసుకోవచ్చు. దాని వల్ల కూడా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుతుంది.

హోం క్వారంటైన్ లో ఉన్నవాళ్లు, ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్స్ ఈ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లేవల్స్ ను పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బొక్కబోర్లా పడుకున్నప్పుడు కనీసం అర్ధగంట నుంచి రెండు గంటల వరకు అలాగే పడుకొని శ్వాసను పీల్చాల్సి ఉంటుంది. అప్పుడు శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ లేవల్స్ పూర్థిస్తాయిలో అందుతాయి.

Proning : ఈ ప్రక్రయను ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు?

>

అయితే… ప్రోనింగ్ ప్రక్రియను అన్నం తిన్నవెంటనే చేయకూడదు. అన్నం తిన్న తర్వాత పొట్ట నిండుగా ఉంటుంది. ఆ సమయంలో బొక్కబొర్లా పడుకుంటే.. కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే… అన్నం తిన్న ఓ గంట రెండు గంటల తర్వాత ఈ ప్రక్రియను చేయొచ్చు. ఒక్క రోజులో కనీసం 16 గంటల వరకు కూడా ప్రోనింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు, గర్భిణీలు, బ్యాక్ బోన్ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ప్రోనింగ్ చేయకూడదు. చాలామందికి ఆక్సిజల్ లేవల్స్ 94 కంటే తక్కువ పడిపోయినప్పుడు మాత్రమే ఆక్సిజన్ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు ఈ ప్రోనింగ్ ప్రక్రియ చేపడితే… ఆక్సిజన్ లేవల్స్ వెంటనే పెరుగుతాయి.

Advertisement

Recent Posts

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

Ysrcp : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేత‌లు మెల్లమెల్ల‌గా…

4 mins ago

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

1 hour ago

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

2 hours ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

3 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

4 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

5 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

6 hours ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

7 hours ago

This website uses cookies.