how to preapre easily chicken noodles cutlet
Chicken Noodles : చికెన్ అండ్ నూడుల్స్ కట్ లెట్ అంటే ఇష్టపడని వారుండరు. ఎంతో స్పైసీ స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ నూడుల్స్ కట్ లెట్ ని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ ఐటమ్ ని ఎక్కువగా పార్టీలు, ఫంక్షన్లలో ఎక్కువగా చేయిస్తుంటారు. అయితే బయట రెస్టారెంట్లలో ఉండే రుచితోనే ఈ ఐటమ్ ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. శాఖాహారులు అయితే చికెన్ కి బదులు బంగాళ దుంపలను వాడుకొని కూడూ ఈ నూడుల్స్ కట్ లెట్ ని తయారు చేసకోవచ్చు.కావాల్సిన పదార్థాలు.. 4 ఉల్లిపాయలు, ఒక కప్పు తురిమిన క్యారెట్, కప్పు స్పింగ్ ఆనియన్స్, కప్పు క్యాబేజీ, కప్పు క్యాప్సికం, టీ స్పూన్ అల్లం, ఆఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు, ఒక టీ స్పూన్ మిరప పొడి, మూడు టేబుల్ స్పూన్ల జొన్న పిండి
ఒక టేబుల్ స్పూన్ లైయ్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ మిర్చి సాస్, ఒఖ గుడ్డు, తగినంత ఉప్పు, నూనె. అలాగే పావు కిలో ఉడక బెట్టిన చైనీస్ నూడుల్స్, 200 గ్రాముల కీమా చికెన్.తయారు చేసే విధానం… స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి సగం టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు, టీ స్పూన్ అల్లం పేస్టు, కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన చికెన్ వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. దీనికి రాక్ సాల్ట్ యాడ్ చేసి 2నిమిషాల పాటు కుక్ చేయాలి. అలాగే ఇదే మిశ్రమానికి క్యాబేజీ, తరిగిపెట్టిన క్యారెట్, క్యాప్సికం వేసుకొని బాగా కలుపుకోవాలి.
how to preapre easily chicken noodles cutlet
అనంతరం ఉల్లికాడలు వేసి కట్ లెట్ ఫేవర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ మిశ్రమంలో అన్ని పదార్థాలు ఉడికేందుకు తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. మిశ్రమంలో నీరంతా ఇంకిపోయి క్రిస్పీగా మారేంత వరకు కుక్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. అనంతరం దీనికి కోడిగుడ్డు, ఉడకబెట్టిన నూడిల్స్, 3 టేబుల్ స్పూన్ ల మొక్కజొన్న పిండి వేసి కట్ లెట్ మిశ్రమంలోని పదార్థాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక కట్ లెట్ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. బంగారు వర్ణంలోని మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని చికెన్ అండ్ నూడిల్స్ కట్ లెట్ రెడీ అయిపోతుంది. దీన్ని సాస్ లేదా చట్నీ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
This website uses cookies.