will kollywood-heros- set in telugu
Kollywood Heroes : గతంలో ఎప్పుడూ లేని విధంగా తమిళ స్టార్ హీరోలందరూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నా రు. సీనియర్ హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రమే తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసేవారు. కమల్ – రజనీ తెలుగులో కొన్ని స్ట్రైట్ సినిమాలు చేశారు. కానీ, ఎక్కువ ఇక్కడ ఎప్పుడూ ఫోకస్ పెట్టింది లేదనే చెప్పాలి. అయితే, ఇప్పటి జనరేషన్ హీరోలందరు మన టాలీవుడ్ మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. విజయ్, ధనుష్, శివ కార్తికేయ లాంటి వారు ఇక్కడ స్ట్రైట్ సినిమాలు చేస్తున్నారు.విజయ్‌కు తమిళంలో మంచి స్టార్ డం ఉంది.
ఇప్పుడు అక్కడ తను పాన్ ఇండియన్ హీరో. ఈ నెల 13న బీస్ట్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత తెలుగులో ఎంట్రీ ఇస్తూ స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిసోంది. త్వరలో రెగులర్ షూటింగ్ ప్రారంభమవబోతోంది. ఇక ఈ కథను తెలుగు స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు. మరి విజయ్‌కు వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. అలాగే, కోలీవుడ్‌లో అగ్ర హీరోగా వెలుగుతున్నాడు ధనుష్.తన టాలీవుడ్ ఎంట్రీ కూడా కన్‌ఫర్మ్ అయింది. తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తెలుగులో సార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
will kollywood-heros- set in telugu
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను చూస్తున్నారు. ఇక తమిళంలో మంచి కథలతో హిట్స్ అందుకుంటూ దూసుకుపో తున్న శివ కార్తికేయన్ కూడా తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, వీరికి తెలుగు స్ట్రైట్ సినిమాలు ఎంతవరకు కలిసిస్తాయనేది ఇప్పుడే చెప్పలేము. స్ట్రైట్ సినిమాలతో మన టాలీవుడ్ హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకుంటారా అనేది కాస్త సందేహమే అంటున్నారు. చూడాలి మరి వీరి సినిమాలు రిలీజయ్యాక రిజల్ట్ ఎలా వస్తుందో.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.