Jobs In BSF : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. బీఎస్ఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలు

 Authored By mallesh | The Telugu News | Updated on :22 January 2022,7:30 pm

Jobs In BSF : దేశంలోని నిరుద్యోగులకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్‌లో భారీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 2788 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 1వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్ష, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు దేశానికి సేవ చేసే అద్భుత అవకాశాన్ని పొందుతారు.పదో తరగతి పాసై ఫిట్ నెస్ కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిజికల్ ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తే పరీక్షలో విజయం సాధించడం సులభం..

 దేశ రక్షణలో ఉండాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. మొత్తం ఖాళీలు 2788 ఉండగా.. ( ఇందులో పురుషులు -2651, మహిళలు-137 అవకాశం ఉంది. పోస్టుల గురించి తెలుసుకుంటే కోబ్లర్ -91 (పురుషులు -88, మహిళలు-3) టైలర్ 49 పోస్టులకు ( పురుషులు-47, మహిళలు-2) వంట చేసేవారు 944 పోస్టులకు (పురుషులు -897, మహిళలు-47), డబ్లూసీ : 537 పోస్టులకు (పురుషులు -510, మహిళలు-27), డబ్లూఎం 356 (పురుషులు-338, మహిళలు-18), బార్బర్ 130 పోస్టులు (పురుషులు-123, మహిళలు-7) స్వీపర్ :637 (పురుషులు-617, మహిళలు -20) కార్పెంటర్ -13, పెయింటర్ -3, ఎలక్ట్రీషియన్ -4, డ్రాఫ్ట్స్మెన్ -1, వెయిటర్ -1, మాలి-4, సెలక్షన్ ప్రాసెస్ : ఫిజికల్ టెస్టు , ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Jobs In BSF huge constable job opportunities in bsf

Jobs In BSF huge constable job opportunities in bsf

Jobs In BSF: అభ్యర్థుల అర్హతలు, ఇతర అంశాలు

ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు విభాగంలో ఫురుషులకు 5కిలో మీటర్లు పరుగు ఉంటుంది. 24 నిమిషాల టైం. మహిళా అభ్యర్థులు 1.6 కిలోమీటర్లు 8.30 నిమిషాల టైం. రాత పరీక్ష అబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ 100 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులు. రెండు గంటల టైం ఉంది.పదోతరగతి అర్హత. రెండేళ్ల డిప్లామా, రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పే మాట్రిక్స్ లెవల్ -3లో కానిస్టేబుల్ పోస్టులో నియామకం ఉంటుంది. రూ.21,700-69,100 సాలరీ ఉంటుంది. కేంద్రం అలవెన్సులు వర్తిస్తాయి. మార్చి 1లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేయాలి. వెబ్ సైట్ www.rectt.bsf.gov.in అప్లికేషన్ చేయాలి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి