కత్తులతో పొడవబడి భర్త చనిపోయాడు..పోలిసుల ముందు బోరుమన్న భార్య.. చివరికి ట్విస్ట్ పోలీసులకు షాక్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

కత్తులతో పొడవబడి భర్త చనిపోయాడు..పోలిసుల ముందు బోరుమన్న భార్య.. చివరికి ట్విస్ట్ పోలీసులకు షాక్..!!

సమాజంలో ప్రతి అక్రమ సంబంధం దాదాపుగా ఒక హత్యతోనే ముగుస్తుంది. కొన్ని సంవత్సరాలు చాటుమట్టుగా సంబంధం కొనసాగించిన చివరాఖరికి మాత్రం ఎవరో ఒకరు ఆ అక్రమ బంధానికి బలి కావాల్సిందే. సమాజంలో ప్రస్తుతం ఇలాంటి ఘటనలే ఎక్కువైపోతున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లలో పెయింటింగ్స్ వేస్తూ జీవనం కొనసాగించే అమీర్ కి షాహిన్ అనే అమ్మాయితో పెళ్లయింది. పెళ్లి తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే అపార్ట్మెంట్లలో షబ్బీర్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 July 2023,7:00 pm

సమాజంలో ప్రతి అక్రమ సంబంధం దాదాపుగా ఒక హత్యతోనే ముగుస్తుంది. కొన్ని సంవత్సరాలు చాటుమట్టుగా సంబంధం కొనసాగించిన చివరాఖరికి మాత్రం ఎవరో ఒకరు ఆ అక్రమ బంధానికి బలి కావాల్సిందే. సమాజంలో ప్రస్తుతం ఇలాంటి ఘటనలే ఎక్కువైపోతున్నాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. అపార్ట్మెంట్లలో పెయింటింగ్స్ వేస్తూ జీవనం కొనసాగించే అమీర్ కి షాహిన్ అనే అమ్మాయితో పెళ్లయింది. పెళ్లి తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే అపార్ట్మెంట్లలో షబ్బీర్ అనే ఒక కారు డ్రైవర్ తో షాహిన్ అక్రమ సంబంధం పెట్టుకుంది.

అతడి ఇచ్చే బిర్యాని మరియు టిఫిన్లకు బాగా అలవాటు పడి భర్త అమీర్ లేని సమయంలో.. షబ్బీర్ తో బాగా ఎంజాయ్ చేసేది. అయితే తన భర్త అమీర్ నీ చంపేసి రెండో పెళ్లి చేసుకుంటానని.. అప్పుడు ఇద్దరం ఇంకా ఎంజాయ్ చేయొచ్చని.. షాహిన్ బరితెగించి ఆలోచన చెప్పడంతో షబ్బీర్ దారుణానికి వడిగట్టాడు. అమీర్ నీ చంపడానికి స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో అతడికి రఫీ అనే వ్యక్తి ద్వారా పెయింటింగ్ కాంట్రాక్టులు ఉన్నాయని.. భారీ మొత్తంలో ఓ ప్రాజెక్టు డమ్మీగా ఒప్పించడు. ఈ రఫీ అనే వ్యక్తి షబ్బీర్ కి స్నేహితుడు. పెద్ద మొత్తానికి పెయింటింగ్ డీల్ కుదరటంతో అమీర్ కూడా రఫీని బాగా నమ్మేశాడు.

husband dies after wife gave unexpected shock to police

husband dies after wife gave unexpected shock to police

ఈ క్రమంలో పెయింటింగ్ డీల్ కుదిరింది కదా పార్టీ చేసుకుందామని అమీర్ నీ నిర్మానుష్యమైన ప్రదేశంలోకి రఫీ రమ్మని అతడికి అక్కడ ఫుల్లుగా మందు తాగించాడు. ఆ తర్వాత సీన్లోకి షబ్బీర్ ఎంట్రీ ఇచ్చి.. అమీర్ నీ చాలా దారుణంగా కిరాతకంగా కత్తులతో రఫీతో పాటు పొడిచి చంపేశారు. నిర్మానుషమైన ప్రాంతంలో ఘటన జరగటంతో అక్కడ శవం ఉందని పోలీసులు సమాచారం మేరకు మొత్తం వివరాలు తెలుసుకుని భార్య షహీన్ కి సమాచారం అందించగా పోలీసులు మిగతా వాళ్లందరి ముందు బొరుమని ఏడుస్తూ మహానటిగా నటించేసింది. ఎవరికి అనుమానం రాకుండా తన భర్తకి ఎలాంటి గొడవలు గాని శత్రువులు గాని లేరని నమ్మించింది.

కానీ పోలీసులు విచారణలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా షబ్బీర్ మరియు రఫీ లను పట్టుకొని.. విచారించగా మొత్తం అక్రమ సంబంధం బయటపడింది. పైగా అమీర్ నీ చంపిన తర్వాత చివరిగా షబ్బీర్ తన ఫోన్ నుండి… షాహిన్ కి ఫోన్ చేయటంతో.. పోలీసులు ఆమెను కూడా తమదైన శైలిలో విచారణ చేస్తే నేరం ఒప్పుకుంది. ఈ ఘటనలో నిందితులుగా రఫీ, షబ్బీర్ తో పాటు షాహిన్ పేరు కూడా పోలీసులు చేర్చారు.

Tags :

    sekhar

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది