Home » Exclusive » Huzurabad Result 9th Round Lead By Bjp
Exclusive

Huzurabad Result : తొమ్మిదో రౌండ్ పూర్త‌య్యే స‌రికి భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న ఈటల రాజేంద‌ర్‌

Authored By
praveen T
The Telugu News | Published on: November 2, 2021, 2:20 pm
Advertisement

Huzurabad Result : హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం ఆ నియోజకవర్గ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అధికారులు కౌంటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆరు రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ తర్వాత రౌండ్లు ఏడు, ఎనిమిది, తొమ్మిదో రౌండ్లలోనూ ముందంజలో ఉంది.

Advertisement

huzurabad result 9th round lead by bjp

రౌండ్లు పూర్తవుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం పెంచుకుంటూనే ముందుకు సాగుతున్నారు. తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ 5 వేల ఓట్లతో లీడ్‌లో ఉండటం గమనార్హం. తొమ్మిదో రౌండ్‌లో బీజేపీకి 40, 412 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 35,307 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన 22 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

బీజేపీ శ్రేణులు ఆల్రెడీ కరీంనగర్, హుజురాబాద్ ప్రాంతంలో సంబురాలకు సిద్ధమవుతున్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉప ఎన్నిక ఫలితాలను పరిశీలిస్తున్నారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి