vadinamma 2 november 2021 full episode
Vadinamma 2 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 నవంబర్ 2021, మంగళవారం 689 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రఘురామ్ లేచాడు అని తెలియగానే లక్ష్మణ్, భరత్ సంతోషపడతాడు. రిషి వల్లనే బావ లేచి తిరిగాడు అని శైలూ అనగానే రిషిని తీసుకొని నేను హాస్పిటల్ కు వెళ్తా అంటాడు భరత్. దీంతో శైలూకు కోపం వస్తుంది. నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్లొద్దు. ఎవరికీ ఇవ్వను. నా బిడ్డ నా దగ్గరే పెరుగుతాడు అని చెప్పి రిషిని తీసుకొని వెళ్తుంది. దీంతో అసలు ఏం జరుగుతుందోనని రాజేశ్వరి, సిరి బాధపడతారు.
vadinamma 2 november 2021 full episode
కట్ చేస్తే ఆసుపత్రిలో ఏడ్చుకుంటూ ఉంటాడు రఘురామ్. నిన్ను బాధపెట్టాను బావ.. అంటే. నువ్వు అసలు మనిషివేనా. ద్రోహివి నువ్వు. గొప్ప త్యాగం చేశానని అనుకుంటున్నావా? అంటూ రఘురామ్.. సీతను తిడతాడు. నన్ను చంపేశావు సీత. నేను నీ మెడలో కట్టిన తాళికి విలువ లేకుండా చేశావు. ఆ తాళిని అవమానించావు. తేనె పూసిన కత్తితో నా గుండెల్లో గుచ్చావు. నేను చావు బతుకుల మధ్య కొట్టుకోకపోయి ఉంటే నువ్వు రిషి మన బిడ్డ అని చెప్పేదానివా? చెప్పేదానివి కాదు. జీవితాంతం నా చేతగాని తనానికి.. నిస్సహాయతకు చచ్చిపోయేవాడిని. నువ్వు నన్ను బతికించుకున్నాను అని అనుకుంటున్నావేమో.. కాదు.. ఇప్పుడు నన్ను నిజంగా చంపావు. నేను చచ్చిపోయాను సీత. ఇప్పటికైనా నేను మనసు విప్పి మాట్లాడకపోతే నన్ను నేను మోసం చేసుకున్న వాడిని అవుతాను.
నువ్వు నీ వైపు నుంచి ఆలోచిస్తే.. నేను నీ వైపు నుంచి ఆలోచిస్తే.. నా వైపు నుంచి ఎవరు ఆలోచిస్తారు. ఎవరు నా గురించి అడుగుతారు. ఇప్పటి వరకు నన్ను ఎందరో మోసం చేశారు. కానీ.. ఇఫ్పుడు నా సీతే నన్ను మోసం చేసింది. నేను ఏమైపోవాలి. ఎందుకు బతకాలి.. ఎలా బతకాలి.. ఎవరి కోసం బతకాలి అంటాడు రఘురామ్.
నువ్వు శైలూకు గొప్ప త్యాగం చేశావు కానీ.. నిన్ను నమ్ముకున్న వాడిని నువ్వు మోసం చేశావు అది మరిచిపోకు అంటాడు రఘురామ్. శైలూను బతికించుకున్నావు కానీ.. నేను చచ్చిపోయినా పర్లేదా అంటాడు. అది కాదు బావ.. మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాం. పాపు శైలూ అలా కాదు కదా.. తను ఏమవుతుందో అని భయపడ్డాను అంటుంది సీత.
సీత మనల్నందరినీ మోసం చేసిందమ్మా అంటాడు సీత అన్న భాస్కర్. సుశీల అస్సలు నమ్మదు. కానీ.. సీతకు కొడుకు పుట్టాడని చెబుతుంది. రిషి తన కొడుకే అని చెబుతాడు మాధవ్. దీంతో సుశీల షాక్ అవుతుంది. వెంటనే సీత ఇంటికి వచ్చి ఆ పిల్లాడిని తీసుకొని ముద్దాడుతుంది. శైలూ చేతుల్లోంచి గుంజుకోవడంతో శైలూ షాక్ అవుతుంది. వాడికి అన్నం పెడుతున్నాను ఇలా ఇవ్వండి అంటుంది. ఇవ్వను.. ఇప్పటి వరకు నువ్వు పెట్టింది చాలు.. నేనే పెడతాను అంటుంది సుశీల.
vadinamma 2 november 2021 full episode
బాబును ముట్టుకోకు అంటుంది సుశీల. వీడు నాదగ్గరే ఉంటాడు. నా దగ్గరే ఉండాలి. నేనే అన్నం పెడతాను అంటుంది. నా నుంచి బాబును తీసుకునే హక్కు ఎవ్వరికీ లేదు అంటుంది. నేను వాడి కన్నతల్లిని అంటుంది. దీంతో కాదు నువ్వు వీడి అమ్మవు కాదు. కన్నతల్లివి అస్సలే కాదు అంటుంది. నేను ఇవ్వను.. నా సొంత మనవడు.. అంటుంది. సీత రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అంటుంది సుశీల. దీంతో శైలూతో పాటు సిరి, రాజేశ్వరి షాక్ అవుతుంది. ఇంతలో అందరూ వస్తారు. లక్ష్మణ్ తో నేను వాడి కన్నతల్లి కాదు అంటుంది.. అని చెబుతుంది.
రాజేశ్వరిని నిజం చెప్పమని చెప్పు.. అంటే రాజేశ్వరి కూడా నిజం చెప్పదు. అన్ని విషయాలు చెప్పేస్తుంది సుశీల. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో సీత వస్తుంది. సీత చెప్పినా వినదు. భాస్కర్ కూడా వస్తాడు. భాస్కర్ చెప్పినా కూడా వినదు. అమ్మ అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు. నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. శైలూకు బాబును ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది. కానీ.. సుశీల అస్సలు వినదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…
High Protein Vegetables : మీ జుట్టు నుండి కండరాల వరకు అనేక శరీర భాగాలకు ప్రోటీన్ ముఖ్యమైనది మరియు…
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
This website uses cookies.