BJP : బ్రేకింగ్.. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ కు ఉగ్ర ముప్పు…?

Authored By venkat G | The Telugu News | Published on: February 11, 2022, 1:45 pm

BJP : హైదరాబాద్ బీజేపీ కార్యాలయం మీద పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేసారు. ఉగ్రముప్పు ఉందనే సమాచారం నేపధ్యంలో ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల పట్టుబడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉండటంతో అటు బీజేపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు.

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో భద్రత పరమైన తనిఖీలు నిర్వహించిన పోలీస్ ఉన్నతాధికారులు… బీజేపీ కార్యాలయంలో కలియతిరిగి కొలతలు తీసుకున్నారు. యూపీలో ఎంపీ అసదుద్దీన్ ఘటన తర్వాత అప్రమైతమైన పోలీసులు… ప్రతీ విషయాన్ని సున్నితంగా తీసుకున్నారు. కార్యాలయం చుట్టూ పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీసారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగే అవకాశముందని గతంలో నిఘావర్గాలు హెచ్చరించాయి.

hyderabad bjp office under threat

hyderabad bjp office under threat

కార్యాలయానికి భద్రత కల్పించాల్సి‌ బాధ్యత పోలీసలదేనని బీజేపీ నేతలు అంటున్నారు. భద్రతకు అవసరమైన ఖర్చులు బీజేపీనే భరించాలని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ నేతలు, బీజేపీ కార్యాలయ సిబ్బందితో‌ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. పార్టీ ఆఫీస్ లోకి వచ్చే వారు అందరి పేర్లను నమోదు చేసుకోవాలని, సీసీ కెమెరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

venkat G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp