#image_title
Birthday bumps | బర్త్‌డే వేడుకల్లో స్నేహితులు సరదాగా ఆటపట్టించడం సాధారణమే అయినా, ఇటీవల ‘బర్త్‌డే బంప్స్’ పేరిట జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ బంప్స్ ఇప్పుడు చిన్నారుల ఆరోగ్యాన్ని సీరియస్‌గా హానిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నాచారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థి ఒకరు ఈ తప్పుడు సరదాకు బలి అయ్యాడు.పుట్టినరోజు సందర్భంగా స్కూల్‌లో లంచ్ టైంలో విద్యార్థిని అతడి స్నేహితులు పట్టుకొని గాల్లోకి ఎత్తుతూ బర్త్‌డే బంప్స్ ఇచ్చారు.
#image_title
ఇదేం గోల..
అయితే ఈసారి వారి ఆట మరీ శ్రుతిమించిపోయింది. దాడి స్థాయికి వెళ్లిన ఆ బంప్స్‌లో విద్యార్థి మర్మాంగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వృషణాల్లో ఉబ్బరం ఏర్పడి, రక్తస్రావం కూడా మొదలైంది. స్కూల్ సిబ్బంది పరిస్థితి తీవ్రంగా ఉండటాన్ని గమనించి, వెంటనే అతడిని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థి ప్రమాదం నుంచి బయటపడినా, మూడు నెలలపాటు బెడ్‌రెస్ట్ అవసరం అని డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పలు విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్కూళ్లలో పిల్లల మధ్య జరుగుతున్న అతి సరదా తీరుపై ప్రశ్నలు కలిగిస్తోంది. పాఠశాలలు, తల్లిదండ్రులు, విద్యార్థులంతా ఈ తరహా ప్రమాదకరమైన సంప్రదాయాలపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. సరదా పేరుతో ప్రాణాలకు భయం కలిగించే స్థాయికి వెళ్లకూడదు.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.