
Apple Iphone 14 Launch soon But Prices also will Incrase
Apple Iphone 14 : యాపిల్ తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే.. చైనా, తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో యాపిల్ టెక్ దిగ్గజానికి కొన్ని అవాంతరాలు ఏర్పడే చాన్సెస్ ఉన్నాయంటున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. వచ్చేనెలలో మార్కెట్‌లోకి తీసుకురానున్న ఐ-ఫోన్14 ఫోన్‌ను చైనాతోపాటు భారత్‌లోనూ ఉత్పత్తి చేయాలని ఆపిల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఆపిల్ ఐ-ఫోన్ 14 సిరీస్‌లో ఐ-ఫోన్14, ఐఫోన్ మ్యాక్స్, ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్లను భారత్‌లోనూ ఉత్పత్తి చేయనున్నది. ఐఫోన్ 13 సిరీస్ కంటే మరిన్ని మెరుగైన ఫీచర్లను అందించారని రూమర్స్ పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ధరలను యాపిల్ అధికంగా పెంచవచ్చని అభిప్రాయపడ్డారు ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో వీటి ధరలు ఐఫోన్ 13 ప్రో ఫోన్ల ధరల కంటే మరింత ఎక్కువగా ఉంటే కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది. యాపిల్ ఫోన్ 14 ప్రో మోడళ్ల ధరలను యాపిల్ పెంచవచ్చని కువో తాజాగా ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే కచ్చితమైన ధరలను ఆయన వెల్లడించలేదు.ఐఫోన్ 14 సిరీస్ ధర ఈ ఏడాది 15 శాతం పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లలో ఉన్న కొత్త ఫీచర్లు కూడా అధిక ధరకు కారణమవుతున్నాయి
Apple Iphone 14 Launch soon But Prices also will Incrase
టెక్ రిపోర్ట్స్ ప్రకారం, ఐఫోన్ 14 సిరీస్ అధికారికంగా లాంచ్ అయిన 10 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 16 నుంచి భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 6న ఐఫోన్ 14 ఈవెంట్ జరగవచ్చని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. చైనాతోపాటు భారత్‌లో ఫోన్లను తయారు చేయాలని ఆపిల్ నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైన మైలురాయి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్లు 256GB ఇంటర్నల్ స్టోరేజీతో లాంచ్ కానున్నాయని టాక్. ఈ స్టోరేజ్ సాధారణ 128GB కంటే రెండింతలు కాబట్టి ఈ మెరుగైన ఫీచర్స్ ధర పెరుగుదలకు దారితీయవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.