
Aadhaar Card ; ఈ రోజుల్లో ఫోన్ పేని వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు కూడా క్యాష్ అవసరం లేకుండా ఫోన్ పేతో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాంలో ఒకటైన ఫోన్ పే సర్వీసులను ప్రస్తుతం 350 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. అత్యంత పాపులర్ ఇన్‌స్టంట్ పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. యూపీఐ పేమెంట్స్ ప్రక్రియతో పాటు ఎప్పుడైనా తమ బ్యాంక్ అకౌంట్లను డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. అయితే యూజర్లు యూపీఐ పేమెంట్ చేయాలంటే ఓటీపీ అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఫోన్ పే యాక్టివేట్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్‌తోనే అనుసంధానం చేస్తున్నారు. ఫోన్ పేతో ఆధార్ కనెక్ట్ చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి యూపీఐ యాక్టివేషన్‌ను పూర్తి చేయడానికి ఫోన్ పే ఇప్పుడు కొత్త యూజర్లకు అనుమతిస్తుంది. ఆధార్ బేస్డ్ యూపీఐ ఆన్‌బోర్డింగ్ సర్వీసులు తీసుకువచ్చిన తొలి యూపీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా ఫోన్ పే నిలిచింది. కొత్త సర్వీసులు తీసుకురావడం వల్ల చాలా మంది ఇంకా ఫోన్ పే సేవలు పొందటం వీలవుతుంది. ఫోన్‌పే యూజర్లు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆధార్ కార్డులోని చివరి ఆరు నెంబర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
యూజర్లకు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఫోన్ పే సర్వీసులు పొందొచ్చు. అంటే డెబిట్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు ఇది మంచి ఉదాహరణ అని ఫోన్‌పే హెడ్ దీప్ అగర్వాల్ తెలియజేశారు. యూపీఐ అనేది గ్లోబల్ సక్సెస్ అని అభిప్రాయపడ్డారు. యూపీఐని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఎన్‌పీసీఐతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కాగా ఫోన్‌పే వేగంగా దూసుకుపోతోందని చెప్పుకోవచ్చు. ఫోన్‌పే కొత్త సర్వీసుల నేపథ్యంలో గూగుల్ పే కూడా ఇలాంటి సర్వీసులను లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
This website uses cookies.