Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో కొత్త వివాదం చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఇటలీ బాక్సర్‌కు తీరని అన్యాయం జరిగింది. లింగ నిర్దారణ పరీక్షలో విఫలమైన అల్జీరియాకు చెందిన బాక్సర్ ఇమేన్ ఖెలిఫ్‌కు ఒలింపిక్స్ నిర్వాహకులు అనుమతిచ్చారు. దాంతో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారి తీవ్రంగా గాయపడింది. 46 సెకన్లలోనే మ్యాచ్‌ను ముగించిన అల్జీరియా.. ఏంజెలా కారిని బౌట్ నుంచి నిష్క్రమించేలా బెంబేలెత్తించింది. దాంతో ఒలింపిక్స్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఓ అథ్లెట్ హిజాబ్ ధరించడంతో.. ఓపెనింగ్ సెర్మనీ నుంచి నిషేధం విధించిన ఉదంతం పెను వివాదానికి కారణమైంది.
ఇప్పుడు మహిళా బాక్సర్‌పై మగ బాక్సర్‌ను బరిలోకి దింపారని ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి 66 కేజీల వెల్టర్ వెయిట్ విభాగంలో ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినీ అల్జీరియా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్‌తో తలపడింది. కానీ, మ్యాచ్ ప్రారంభమైన కేవలం 46 సెకన్లలో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారినీ పోటీ నుంచి వైదొలిగింది. పురుషుడిలా శారీరక లక్షణాలున్న ఇమాన్ ఖలీఫా మహిళా కంటెస్టెంట్‌తో పోటీకి దిగడమే ఇందుకు ప్రధాన కారణం. నిజానికి పారిస్ ఒలింపిక్స్‌లో చాలా మంది ట్రాన్స్‌జెండర్ పురుష అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారు. ఈ విధంగా వారి లింగాన్ని మార్చుకున్న పోటీదారులు మహిళల విభాగంలో పోటీ చేయడానికి అనుమతిస్తారు. నిర్వాహకుల ఈ నిర్ణయం ఇప్పుడు వివాదానికి కారణమైంది.
లింగమార్పిడి చేసిన పురుషులకు వ్యతిరేకంగా మహిళా పోటీదారులు పోటీపడటం మహిళా అథ్లెట్ల అసంతృప్తికి దారితీసింది. ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల కారిని ఖలీఫా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అతడి ముక్కుకు గాయం కావడంతో పాటు ధరించిన మాస్క్ కూడా తెగిపోయింది. దీంతో కారిని వెంటనే తన కోచ్‌తో మాట్లాడి పోటీ నుంచి తప్పుకున్నాడు. అలా 46 సెకన్లు మాత్రమే సాగిన మ్యాచ్‌లో ఖలీఫా విజేతగా నిలిచాడు. బాక్సింగ్ రింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన ఏంజెలా కారినీ కంటతడి పెట్టుకుంది. ఇది చాలా విచారంగా ఉందంటూ తెలిపాడు. “నా జీవితంలో ఇంత బలమైన దెబ్బ ఎప్పుడూ అనుభవించలేదు” అని అతను చెప్పారు.ఖెలిఫ్ మహిళ కాదని, మగ లక్షణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాల మధ్యే ఆమె ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. అయితే ఖెలిఫ్‌తో పాటు ఒలింపిక్స్ నిర్వాహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.