Aadhaar Card : ఏటీఎం లేక‌పోయిన కూడా ఆధార్ కార్డ్‌తో ఫోన్ పేని యాక్టివ్ ఎలా చేసుకోవ‌చ్చంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aadhaar Card : ఏటీఎం లేక‌పోయిన కూడా ఆధార్ కార్డ్‌తో ఫోన్ పేని యాక్టివ్ ఎలా చేసుకోవ‌చ్చంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2024,4:01 pm

Aadhaar Card ; ఈ రోజుల్లో ఫోన్ పేని వాడ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తి ఒక్క‌రు కూడా క్యాష్ అవ‌స‌రం లేకుండా ఫోన్ పేతో ట్రాన్సాక్ష‌న్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాంలో ఒకటైన ఫోన్ పే సర్వీసులను ప్రస్తుతం 350 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. అత్యంత పాపులర్ ఇన్‌స్టంట్ పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. యూపీఐ పేమెంట్స్ ప్రక్రియతో పాటు ఎప్పుడైనా తమ బ్యాంక్ అకౌంట్లను డిజిటల్‌ పేమెంట్స్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది. అయితే యూజర్లు యూపీఐ పేమెంట్ చేయాలంటే ఓటీపీ అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Aadhaar Card : ఆధార్‌తో అనుసంధం..

అయితే ఫోన్ పే యాక్టివేట్ చేసుకోవ‌డానికి ఆధార్ కార్డ్ కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ రోజుల్లో అన్నింటికి ఆధార్‌తోనే అనుసంధానం చేస్తున్నారు. ఫోన్ పేతో ఆధార్ క‌నెక్ట్ చేసుకోవ‌చ్చ‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి యూపీఐ యాక్టివేషన్‌ను పూర్తి చేయడానికి ఫోన్ పే ఇప్పుడు కొత్త యూజర్లకు అనుమతిస్తుంది. ఆధార్ బేస్డ్ యూపీఐ ఆన్‌బోర్డింగ్ సర్వీసులు తీసుకువచ్చిన తొలి యూపీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా ఫోన్ పే నిలిచింది. కొత్త సర్వీసులు తీసుకురావడం వల్ల చాలా మంది ఇంకా ఫోన్ పే సేవలు పొందటం వీలవుతుంది. ఫోన్‌పే యూజర్లు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆధార్ కార్డులోని చివరి ఆరు నెంబర్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

యూజర్లకు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఫోన్ పే సర్వీసులు పొందొచ్చు. అంటే డెబిట్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కు ఇది మంచి ఉదాహరణ అని ఫోన్‌పే హెడ్ దీప్ అగర్వాల్ తెలియ‌జేశారు. యూపీఐ అనేది గ్లోబల్ సక్సెస్ అని అభిప్రాయపడ్డారు. యూపీఐని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఎన్‌పీసీఐతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కాగా ఫోన్‌పే వేగంగా దూసుకుపోతోందని చెప్పుకోవచ్చు. ఫోన్‌పే కొత్త సర్వీసుల నేపథ్యంలో గూగుల్ పే కూడా ఇలాంటి సర్వీసులను లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది