Smart Phone Pouch : స్మార్ట్ ఫోన్ కి వాడే పౌచ్ వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలిస్తే వెంటనే తీసి పారేస్తారు ..!!
Smart Phone Pouch : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. అయితే ఫోన్ డ్యామేజ్ అవ్వకుండా చాలామంది పౌచ్ లను వాడుతూ ఉంటారు. అయితే దీనివలన చాలా నష్టాలు ఉన్నాయన్న సంగతి ఎవరికీ తెలియదు. పౌచ్ లను వాడటం వలన స్మార్ట్ ఫోన్ అనేది తొందరగా వేడెక్కుతుంది. ఫోన్ అనేది వాడకపోయినా కూడా బ్యాక్ ఎండ్ లో వర్క్ అవుతూనే ఉంటుంది. కొన్ని ప్రాసెసర్లు వలన ఫోన్ లు హీట్ అవుతుంటాయి. అదే ఫోన్ పౌచుల వలన ఇంకా హీట్ అవుతాయి. ఆ పౌచ్ వలన ఫోన్ హీట్ తగ్గదు. దానివలన మన ఫోన్ కే కాదు మనకు కూడా పెద్ద ప్రమాదమే.
If you know how many losses there are due to the pouch used for the smart phone, you will immediately remove it and throw it away
అందుకే రోజుల కొద్దిసేపయినా ఫోన్ పౌచ్ ను తీసేయాలి. ముఖ్యంగా ఫోన్లో గేమ్స్ ఆడే సమయంలో పౌచ్ తీసి చూడడం ఉత్తమం. ఫోన్ కి పౌచ్ వాడడం వలన ముఖ్యంగా ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ చెడిపోతుంది. చాలా స్మార్ట్ ఫోన్ లకు పౌచ్ వలన బ్యాక్ ప్యానెల్ డిజైన్ చెడిపోవడం, ఫెడ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ కింద పడిన ప్రతిసారి పౌచ్ వలన బ్యాక్ ప్యానెల్ కి గీతలు పడుతూ ఉంటాయి. పౌచ్ ఉన్న ఫోన్ కచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అయితే అది పైకి కనిపించకపోయిన ఇంటర్నల్ గా జరిగే అవకాశం ఉంటుంది.
అందుకే అప్పుడప్పుడు ఫోన్ పౌచ్ తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫోన్ పౌచ్ వలన బ్యాక్టీరియా కూడా ఎక్కువ చేరుతుంది. బ్యాక్ పౌచ్ వాడడం వలన బ్యాక్టీరియాకు తోడు దుమ్ము, ధూళి కూడా తోడవుతుంది. బ్యాక్ కేస్ వల్ల ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై, పౌచ్ లో డస్ట్ ఎక్కువగా పేరుకుంటుంది. దాని వలన మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు పౌచ్ లు తీసి క్లీన్ చేస్తూ ఉండాలి. ఫోన్ కి వేసే టెంపర్డ్ గ్లాస్ కూడా పౌచ్ వలన దెబ్బతింటుంది. అందుకే ఫోన్ పౌచ్ ల వాడకం తగ్గించాలి. ఒకవేళ స్మార్ట్ ఫోన్ కి పౌచులు వాడిన వాటిని ప్రతిరోజు కొద్దిసేపు తీసి క్లీన్ చేస్తూ ఉండాలి.