Ind vs Pak: గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత్ .. పాక్ చేతిలో దారుణంగా ఓటమి పాలైన విషయం తెలసిందే. ఆ ఓటమికి అచ్చంగా ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కి దిగిన పాక్‌ని ఓ ఆటాడుకున్నారు బౌలర్లు. ముఖ్యంగా భువి, పాండ్యా తమ సత్తా చాటారు. రిజ్వాన్ తప్ప.. ఇంకెవర్నీ నిలదొక్కుకోనివ్వలేదు మన బౌలర్లు. భువి పాకిస్తాన్‌పై బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 26 పరుగులకు 4 వికెట్లు తీస్తే.. కీలక సమయాల్లో చెలరేగిన పాండ్యా 24 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాక్ 19.5 ఓవర్లలో 147కి ఆలౌట్ అయింది.148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కాస్త కష్టపడుతూనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది.
పాండ్యా వేగంగా పరుగులు సాధించేందుకు మొగ్గు చూపాడు. జడేజా 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, రెండు ఫోర్లున్నాయి. చివరి ఓవర్లో జడేజా భారీ షాట్ కొడదామని యత్నించి.. ఫస్ట్ బాల్‌కే ఔటయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్‌ని గెలిపించే బాధ్యతని పాండ్యా తీసుకున్నాడు. సిక్సర్ కొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు. అయితే ఈ హైఓల్టేజ్ సమరం కావాల్సినంత మజాను అందించింది. తూటాలు, తుపాకులు లేని ఈ యుద్దంలో దక్కిన విజయం భారత అభిమానులను సంతోషపర్చగా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను డిస్నీ హాట్‌స్టార్‌లో గరిష్టంగా కోటీ 30 లక్షల మంది చూశారు. ఇప్పటి వరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ కోటీ 20 లక్షలు మాత్రమే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్Xపాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌ల్లో ఈ వ్యూస్ వచ్చాయి. తాజా మ్యాచ్ ఆ రికార్డులన్నిటీని ఆసియాకప్ మ్యాచ్ అధిగమించింది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే. ఆదివారం కావడం.. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి భారీ ఎత్తున ప్రచారం జరగడం.. విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై భారీ హైప్ ఏర్పడిన విషయం విదితమే.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.