
ind vs pak thrills to audience On Player Is Highlight
Ind vs PaK : ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా టఫ్ ఫైట్ ఈ రెండు జట్ల మధ్య నడుస్తూ ఉంటుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్‌లోను అలానే సాగింది. ఒకానొక దశలో మ్యాచ్ గెలుస్తామా అన్న డౌట్ నుంచి.. హార్థిక పాండ్యా సిక్సర్ కొట్టి గెలిపించే వరకు రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది. కోట్లాది మంది అభిమానులు ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు.అసలు పాకిస్తాన్ ను 120 లోపే కట్టడి చేద్దామనుకుంటే పాక్ చివరి వరుస బ్యాట్స్ మెన్ పోరాడడంతో 147 పరుగుల భారీ స్కోరు నమోదైంది. దుబాయ్ పిచ్ పై ఒక రకంగా మంచి టార్గెట్ అనే చెప్పాలి. ఈ టార్గెట్‌ని కాపాడుకునేందుకు బాబర్ సేన గట్టిగానే ప్రయత్నించింది.
స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) ను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (29 నాటౌట్).. కెప్టెన్ రోహిత్(4 నాటౌట్)కు జత కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.వీళ్లిద్దరూ అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 38 పరుగులతో నిలిచింది. ఇక ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (18)ను నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది.
ind vs pak thrills to audience On Player Is Highlight
ఇలాంటి సమయంలో జట్టుని ఆదుకున్నాడు జడేజా, కుంగ్ ఫూ పాండ్యా. పాకిస్తాన్ పై టీమిండియా గెలిచిందంటే అతడొక్కడే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్ లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఏకంగా 3 కీలక పాక్ వికెట్లను పాండ్యా పడగొట్టాడు. అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ లోనూ రాణించి టీమిండియాను గెలిపించాడు. పాక్ తో మ్యాచ్ అంటేనే భారీ ఒత్తిడి. వస్తున్న ఆటగాళ్లు అంతా కొట్టలేక సతమతమవుతుంటే హార్ధిక్ ముఖంలో ఏమాత్రం టెన్షన్ ఒత్తిడి కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. చివరి 27 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొట్టి 6 బంతుల్లో 7 పరుగులకు తీసుకొచ్చాడు. తొలి మూడు బంతుల్లో వికెట్ పడి వచ్చింది ఒక పరుగే. 3 బంతుల్లో 6 కొట్టాలి. కానీ హార్ధిక్ పాండ్యా తర్వాత బంతిని సిక్స్ కొట్టి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారత అభిమానుల సంబరాలతో దుబాయ్ స్టేడియం తడిసిముద్దైంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.