OnePlus 9 Pro : ప్రముఖ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ తమ కస్టమర్లకు మరోసారి శుభవార్త చెప్పింది. గతంలో హై రేంజ్ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చిన వన్‌ప్లస్ ఈ మధ్యకాలంలో మీడియం రేంజ్ బడ్జెట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సామ్ సంగ్, రెడ్ మీ, రియల్ మీ ఫోన్లకు పోటీగా హై ఫీచర్స్ మొబైల్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కంపెనీ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇటీవలే తగ్గించిన 9 ప్రో మొబైల్ ధర.. మళ్లీ తగ్గడంతో వాటి డిమాండ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వన్ ప్లస్ కంపెనీ ఇటీవలే 10T మొబైల్‌ను 5G ఫీచర్‌తో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా వన్ ప్లస్ 10 Pro 5G ధరను కంపెనీ తగ్గించింది. ఆ తర్వాత 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గించారు. ఇది మూడో సారి ధర తగ్గడం. అతి తక్కువ ధర అంటే వన్‌ప్లస్ 9ప్రో మోడల్ రూ.10వేలు లేదా రూ.15వేలకు వస్తుందని కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 9 ప్రో మీద రెండోసారి రూ.5,800ల ధరను తగ్గించారు. తాజాగా మూడోసారి వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,200 తగ్గింది. ఈ ఆఫర్ వన్ ప్లస్ 9ప్రో యొక్క రెండు స్టోరేజ్ (8GB + 128GB మరియు 12GB + 256GB)వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.
రెండవ ధర తగ్గింపు తర్వాత 8GB ర్యామ్ రూ. 54,199. 12GB RAM ఎంపిక ధర రూ. 59,199గా నిర్ణయించారు. మూడోసారి ధర తగ్గింపు తర్వాత 9 ప్రో 8GB ర్యామ్ ఎంపిక రూ. 49,999. 12GB RAM ఎంపిక రూ. 54,999కి అందుబాటులో ఉండనుంది. వన్ ప్లస్ 9ప్రో అనేది అద్భుతమైన మొబైల్. చాలా మంచి ఫీచర్లు ఈ వేరియంట్లో లభిస్తోంది.మూడోసారి ధర తగ్గడంతో అద్భుతమైన ఫోన్ మంచి ధరకు రానుంది. ఈ ఫోన్‌కు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. కెమెరా, బ్యాటరీ, ఇంటర్నల్ మొమోరీ, ర్యామ్, ఫర్పామెన్స్ ఇలా అన్నింటిలోనూ 9 ప్రో మోడల్ మంచి రేటింగ్‌ను పొందింది. కెమెరా విషయంలో మాత్రం ఈ ఫోన్‌కు ఏది సాటి రాదని విశ్లేషకులు చెబుతున్నారు.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.