Gecko lizard : స్మగ్లింగ్ అందరికీ తెలిసిన పదమే. ఎక్కువగా సినిమాల్లో విటుంటారు ఈ పదం. అయితే విలువైన వస్తువులు, మొక్కలు, కొన్ని రకాల జంతువులను అక్రమంగా తరలించడాన్నే స్మగ్లింగ్ అంటారు. స్మగ్లింగ్ చట్టపరంగా నేరం అయినప్పటికీ కొందరు కాసులకోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. అరుదైన లోహపు విగ్రహాలు, తాబేలు, బల్లి, గంధం చెక్కలు, మొక్కలు ఇలా ఎన్నో అక్రమంగా రవాణా చేసినవే. అయితే ఈ స్మగ్లింగ్ వెనకాల కోట్లలో బిజినెస్ జరుగుతుంటుంది. అందుకే చాలా మంది వీటిని తరలిచడానికి సాహసిస్తుంటారు. ఇలా తరలిస్తూ పట్టుబడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
అయితే ప్రస్తతం మీహార్ లో ఓ అరుదైన బల్లివేట కొనసాగుతోంది. ఎందుకుంటే దీని ధర కోట్లలో ఉంది గనుక. ఈ అరుదైన బల్లి పేరు గెక్కో లిజార్డ్. కాగా ఈ బల్లికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ విలువైన బల్లి ఆగ్నేయసియాలోని కొన్ని ప్రాంతాల్లోనే నివసిస్తోంది. ఇక మనదేశంలో బీహార్, నెపాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్నే బీహారి బల్లి అనికూడా అంటారు. అయితే ఈ బల్లి మాంసం అనేక వ్యాధులను నయం చేస్తుందనే కారణంగా కోట్లల్లో వెచ్చించి కొనడానికి సిద్దమవుతున్నారు. మధుమేహం, క్యాన్సర్, నపూసకత్వం, ఎయిడ్స్ వంటి వ్యాధులు నయం చేయడానికి ఔషదాల్లో ఈ మాంసం వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఇక ఇండియాలో బల్లులను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్దం. ఇది జీకో వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం నేరం. అయినప్పటికీ స్మగ్లర్లు కాసుల కోసం ఈ బల్లులను పట్టుకుని కోట్లు తీసుకుంటూ చైనా వంటి విదేశాలకు తరలిస్తున్నారు. ఈ బల్లి పరిమాణాన్ని బట్టి డెబ్బై నుంచి ఎనబై లక్షల వరకు బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ బల్లి విలువ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇలా కింతమంది ఈ బల్లికి ఉన్న డిమాండ్ ని క్యాచ్ చేసుకుని అక్రమ రవాణా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.