AP Early Elections : బ్రేకింగ్.. ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు?
AP Early Elections : టైటిల్ చూసి షాక్ అయ్యారా? ఇప్పుడు ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం వల్ల సీఎం జగన్ కు వచ్చే లాభం ఏంటి అని అనుకుంటున్నారా? అవన్నీ కాసేపు పక్కన పెడితే ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ యోచిస్తున్నారట. వైసీపీ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో కూడా ఏపీ ప్రజలకు తెలుసు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. అసలు వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎలాగైనా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ పార్టీ కూడా కసరత్తు చేస్తోంది.
మరోవైపు సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఏపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ముందస్తు ఎన్నికల గురించి కేంద్రంతో చర్చించడానికే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సీఎం జగన్ ఈ మధ్య ఢిల్లీ టూర్స్ ఎక్కువగా వేస్తున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ వెళ్తుండటంతో ఈసారి ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల గురించే అనే ప్రచారం సాగుతోంది. వైసీపీ నేతలు మాత్రం జగన్ ఢిల్లీకి వెళ్లేది పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం అంటున్నారు. కానీ.. పోలవరం నిధుల కోసం ప్రత్యేకంగా పనులు మానుకొని ఈ సమయంలో ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
AP Early Elections : ఢిల్లీకి క్యూ కట్టిన జగన్
ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పార్టీలో వినిపించే నిరసన గళాలు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటమి.. వీటికి చెక్ పెట్టాలంటే.. ప్రత్యర్థ పార్టీలకు సమయం ఇవ్వకూడదు. అందుకే.. ఉన్నపళంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా అందులో వైసీపీ గెలుస్తుందని జగన్ నమ్ముతున్నారట. అందుకే.. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఇంకా ఏడాది సమయం ఉన్నా అసెంబ్లీ ఎన్నికలను సీఎం జగన్ ఇప్పుడే నిర్వహిస్తారా? ముందస్తుకే మద్దతు పలుకుతారా? అనేది.