Home » News » Jabardasth Latest Promo Rashmi Age Dhanraj
News

Jabardasth : రష్మిని అలా అడిగిన ధన్‌రాజ్.. చివరికి ఆమె వయసు కూడా చెప్పేశాడు!

Jabardasth తెలుగు బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 13 ఏళ్లుగా నవ్విస్తూ వస్తున్న పాపులర్ కామెడీ షో జబర్దస్త్ మరోసారి సరికొత్త కామెడీతో సిద్ధమైంది
Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 26, 2026 8:49 pm
Advertisement

Jabardasth  : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను దాదాపు 13 ఏళ్లుగా నవ్విస్తూ వస్తున్న పాపులర్ కామెడీ షో జబర్దస్త్ మరోసారి సరికొత్త కామెడీతో సిద్ధమైంది. ప్రతి వారం కొత్త స్కిట్లు, పంచ్‌లు, కామెడీ ట్రాక్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. ఈసారి కూడా ప్రోమోలో కామెడీ పంచ్‌లతో పాటు రష్మి, ధన్‌రాజ్ మధ్య జరిగిన సన్నివేశం ప్రత్యేకంగా హైలైట్‌గా నిలిచింది. మరి ఈ వారం ఏ టీమ్ ఎలా నవ్వించింది? ఎవరి పంచ్‌లు బాగా పేలాయి? ప్రోమోలో అసలు హైలైట్స్ ఏంటి? అనేది చూస్తే..ప్రోమో ప్రారంభంలోనే చంటి దేవదాసు గెటప్‌లో చేతిలో మందు బాటిల్ పట్టుకుని కనిపిస్తాడు. ‘ఎవరి కోసమంటూ ఇలా వచ్చావు?’ అన్నట్టుగా రష్మి ప్రశ్నించగా.. ‘తాగితే బాధలు పోతాయా?’ అని అడుగుతుంది. అందుకు చంటి తనదైన శైలిలో పంచ్‌లు పేలుస్తాడు.

Advertisement

Jabardasth : రష్మిని అలా అడిగిన ధన్‌రాజ్.. చివరికి ఆమె వయసు కూడా చెప్పేశాడు!

‘‘ఈ మాట నువ్వు అడుగుతున్నావా? ఎంత తాగితే బాధలు పోతాయో నీకు తెలియదా? ఎలా తాగితే బాధలు పోతాయో తెలియదా? నువ్వేం తాగుతావో నాకు తెలియదా?’’ అంటూ వరుస కౌంటర్లు వేయడంతో అక్కడున్నవారంతా నవ్వుకుంటారు.ఆ తర్వాత బిగ్‌బాస్ ఫేమ్ కిర్రాక్ సీత ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే చంటి గత విషయాలను గుర్తు చేసుకుంటూ ఫన్నీగా మండిపడతాడు. ‘‘నేనంటే ప్రేమ అన్నావు.. నేనంటే ఇష్క్ అన్నావు.. మా నాన్నకు ఒంట్లో బాలేదన్నావు.. మా అమ్మకు క్యాన్సర్ అన్నావు.. నా దగ్గర డబ్బులు దొబ్బేశావు.. ఇప్పుడు నేను ఎవరో తెలియదంటున్నావు జెన్‌జీ’’ అంటూ చంటి వేసే డైలాగ్స్ కామెడీ పండిస్తాయి. అదే సమయంలో సీత కూడా తగ్గకుండా కౌంటర్ ఇస్తుంది. ‘‘ఆ రోజు పార్టీలో నన్ను ఒంటరిగా వదిలేసింది నువ్వు కాదు.. నా కన్నీళ్లకు కారణం నువ్వు కాదు’’ అంటూ ప్రశ్నిస్తుంది. దానికి చంటి మరో పంచ్ పేలుస్తూ.. ‘‘ఆ రోజు నేను నీ చేయి పట్టుకుంటే ‘అబ్బా.. అదే టచ్’ అన్నది నువ్వు కాదా?’’ అని అడగడంతో స్కిట్ మరింత కామెడీగా మారుతుంది.

Advertisement

Jabardasth  సద్దాం టీమ్ నుంచి మహేశ్ విట్టా ఫ్యాక్షన్ కామెడీ వరకు..

అనంతరం సద్దాం తన టీమ్‌తో కలిసి స్టేజ్‌పైకి వస్తాడు. ఓ వ్యక్తి తల లేకుండా తిరుగుతుండటాన్ని చూసిన ఓ కుర్రాడు ‘వీడెవడు?’ అని అడుగుతాడు. దానికి సద్దాం ఇచ్చే సమాధానం మరింత నవ్వు తెప్పిస్తుంది. ‘‘నా దగ్గర తల తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు’’ అంటూ అతడు చెప్పడంతో అక్కడ కామెడీ పండుతుంది.మరో స్కిట్‌లో కొత్త టీమ్ సభ్యులు భార్యాభర్తలుగా కనిపిస్తారు. ‘‘మీ పాత బట్టలు ఎవరికైనా ఇచ్చారా?’’ అని భార్య అడగ్గా.. భర్త ‘‘ఇచ్చాను’’ అని సమాధానం చెబుతాడు. దాంతో భార్య తనదైన స్టైల్లో పంచ్ పేలుస్తుంది. ‘‘రాత్రి మీరనుకుని చితక్కొట్టాననుకున్నా’’ అంటూ రాగం తీయడంతో స్కిట్‌లో నవ్వులు పూస్తాయి.ఇదే స్కిట్‌లో మహేశ్ విట్టా ఫ్యాక్షనిస్ట్ గెటప్‌లో కనిపిస్తాడు. ‘‘మీ వాడిని నరికి నా బిడ్డ, నా కోడలు పిల్లను తీసుకొస్తా’’ అంటూ ఫ్యాక్షన్ డైలాగ్ చెబుతాడు. అయితే ఫైట్ చేయాల్సిన సందర్భంలో మాత్రం ‘‘ఆక్ పాక్ కరివేపాకు’’ అంటూ ఆటలు ఆడటం కామెడీగా మారుతుంది.

తర్వాత పంచ్ ప్రసాద్, బిగ్‌బాస్ ఫేమ్ శ్రీసత్య జంటగా కనిపిస్తారు. ‘‘నువ్వు కర్మను నమ్ముతావా?’’ అని ప్రసాద్ అడగ్గా.. సత్య ఇచ్చే సమాధానం పంచ్‌గా ఉంటుంది. ‘‘ఇంతకుముందు నేను కర్మను నమ్మేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను మీ భార్యగా చేయాలన్నారు. అబ్బా.. ఏం కర్మరా బాబు’’ అంటూ ఆమె ఇచ్చిన కౌంటర్ నవ్వులు తెప్పిస్తుంది.ఆ తర్వాత ప్రసాద్ రోహిణిని పిలుస్తాడు. ‘‘మా ఆయన ఇంట్లో లేడు’’ అంటూ రోహిణి చెప్పగా.. ప్రసాద్ ఆమె కోసం ఓ చీర తీసుకొచ్చానని చెబుతాడు. చీరను చూసిన రోహిణి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక ‘జెర్సీ’ సినిమాలో నాని రైలుపక్కన గట్టిగా అరచిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ అలా అరవడంతో ప్రోమోలో నవ్వులు పూస్తాయి.

Advertisement

రష్మి వయసును లీక్ చేసిన ధన్‌రాజ్.. 48 ఏళ్లు అంటూ షాక్!

ప్రోమోలో అత్యంత ఆసక్తికరంగా మారిన సన్నివేశాల్లో ధన్‌రాజ్–యాంకర్ రష్మి కామెడీ కూడా ఒకటి. ధన్‌రాజ్ వచ్చి ‘‘నీకు కుక్కలంటే చాలా ఇష్టమట కదా?’’ అని రష్మిని అడుగుతాడు. అందుకు రష్మి ‘‘ఐ లవ్ డాగ్స్.. ఐ హగ్ డాగ్స్.. ఐ కిస్ డాగ్స్’’ అంటూ సమాధానం ఇస్తుంది.దీంతో ధన్‌రాజ్ అసలు కామెడీ మొదలుపెడతాడు. ‘‘అయితే ఈరోజు నుంచి నన్ను మనిషిలా చూడొద్దు.. కుక్కలా చూడు’’ అంటూ రష్మికి చెబుతాడు. అంతేకాదు, తన దగ్గర ఒక కుక్క ఉండేదని, అది గత పుష్కరాల్లో తప్పిపోయిందని చెప్పి రష్మిని ‘‘నువ్వు ఎన్ని పుష్కరాలు చూశావు?’’ అని ప్రశ్నిస్తాడు.

దానికి రష్మి ‘‘నాలుగు పుష్కరాలు చూశాను’’ అని చెప్పగానే ధన్‌రాజ్ వెంటనే లెక్క వేసి ‘‘నాలుగు పుష్కరాలంటే నీ వయసు 48’’ అంటూ పంచ్ పేలుస్తాడు. దీంతో రష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ధన్‌రాజ్ అక్కడితో ఆగకుండా ఇంద్రజను కూడా ‘‘మీరెన్ని పుష్కరాలు చూశారు?’’ అని అడుగుతాడు. దానికి ఇంద్రజ అమాయకంగా ‘‘పుష్కరాలంటే ఏంటి ధన్‌రాజ్ గారు?’’ అని ప్రశ్నించడంతో మరోసారి నవ్వులు పూస్తాయి.చివర్లో దొరబాబు, సుధాకర్ మధ్య వచ్చే స్కిట్ ప్రోమోకు మరో హైలైట్‌గా నిలుస్తుంది. దొరబాబు చూపులేని వృద్ధుడి పాత్రలో కనిపిస్తాడు. అతడిని చూసుకోవడానికి అతని మనవడు సుధాకర్‌ను పంపిస్తాడు. అయితే సుధాకర్‌కు లేడీ వాయిస్ ఉండటంతో దొరబాబు ఇంటికి వచ్చింది అమ్మాయేనని భావిస్తాడు.

బయట వర్షం బాగా పడిందని, తాను పూర్తిగా తడిసిపోయానని చెబుతూ సుధాకర్ బాత్‌రూమ్‌కు వెళ్లి స్నానం చేసి వస్తానంటాడు. అది విన్న దొరబాబు ‘‘భగవంతుడా.. నా రెండు కాళ్లు తీసుకుపోయి రెండు కళ్లు ఉంచినా బాగుండేది’’ అంటూ బాధపడటం నవ్వులు తెప్పిస్తుంది.అంతటితో ఆగకుండా ‘‘నాకు నిద్ర పట్టడం లేదు.. కొంచెం జో కొడతారా?’’ అని దొరబాబు అడుగుతాడు. అందుకు సుధాకర్ ‘దరికి రాబోకు.. రాబోకు’ అనే పాట పాడతాడు. వెంటనే దొరబాబు ‘‘మీరు బోకు దగ్గరే ఆపేస్తున్నారు’’ అని చెప్పడంతో స్కిట్ కామెడీ పీక్స్‌కు చేరుతుంది.

ప్రస్తుతం ఈ జబర్దస్త్ తాజా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ధన్‌రాజ్ రష్మి వయసుపై వేసిన పంచ్, సీత–చంటి ట్రాక్, మహేశ్ విట్టా ఫ్యాక్షన్ గెటప్, పంచ్ ప్రసాద్–శ్రీసత్య జంట, దొరబాబు–సుధాకర్ స్కిట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.అయితే సీతతో చంటి నిజంగా కలిసిపోయాడా? మహేశ్ విట్టా తన కోడలిని తిరిగి తీసుకొచ్చాడా? పంచ్ ప్రసాద్‌తో రోహిణి బాగోతం గురించి శ్రీసత్యకు తెలిసిపోయిందా? ధన్‌రాజ్‌కు యాంకర్ రష్మి ఎలాంటి కౌంటర్ ఇచ్చింది? తన ఇంట్లో ఉన్నది అమ్మాయి కాదని, అబ్బాయేనని దొరబాబు చివరకు తెలుసుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే జబర్దస్త్ పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి