Janaki Kalaganaledu 12 Aug Today Episode : జానకిని జ్ఞానాంబ ముందు బుక్ చేయడం మల్లిక మాస్టర్ ప్లాన్? జానకి దొంగతనం చేసిందనే అబద్ధంతో మల్లిక రెడీ? జ్ఞానాంబ నమ్ముతుందా?

Janaki Kalaganaledu 12 Aug Today Episode : జానకి కలగనలేదు 12 ఆగస్టు 2021, 104 ఎపిసోడ్ విడుదలైంది. గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామయ్య గారు.. బావ గారు ఇక్కడికి వచ్చారు. ఖార్ఖానాలో ఉన్నాడు. జానకిని కలవడానికి వచ్చాడు. వెంటనే అత్తయ్య గారిని తీసుకొని రండి… అని ఫోన్ చేసి చెబుతుంది మల్లిక. దీంతో రామా రూమ్ కు వెళ్లి చూస్తాడు. అక్కడ చూస్తే రామా నిద్రపోతుంటాడు. దీంతో రామా ఇక్కడే ఉన్నాడు.. అని చెబుతాడు. దీంతో మల్లికకు ఏం అర్థం కాదు. దీంతో.. లేచి చూస్తే అప్పటికే రామా వెళ్లిపోతాడు. దుప్పటి లాగి చూస్తుంది దీంతో జానకి తను ఒక్కతే నిద్రపోతుంటుంది. మల్లికకు ఏం అర్థం కాదు.

Janaki Kalaganaledu 12 august 2021 thursday 104 episode highlights

కరెంట్ షాక్ కంటే.. పెద్ద షాక్ లా ఉంది ఇది. అసలు బావ గారు ఇంతలోనే ఎలా మాయం అయ్యారబ్బా అని ఆలోచిస్తుంటుంది మల్లిక. వెళ్లి బుట్టలో దాక్కుంటాడు రామా. ఆ తర్వాత మళ్లీ వచ్చి జానకిని నిద్రలేపుతాడు. దీంతో.. వెళ్లండి.. అంటుంది. అస్సలు వినడు. దీంతో లేపి బయటికి తీసుకెళ్లి.. వెళ్లిపోండి.. అని చెబుతుంది. మల్లిక చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది.. అని చెబుతుంది. అయినా కూడా వినడు రామా. మీరు అలా నడుము మీద చేయి వేసి లేపుతుంటే బాగుందండి. మరోసారి అలా చేయరా? అంటాడు రామా.

చూడండి.. మల్లిక మాటలను మామయ్య గారు నమ్మలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే.. ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. మల్లికకు మనుషులను, కుటుంబాలను అంత బాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే.. ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా ఎందుకు డబ్బులు దాచుకుంటుంది.. అని మల్లిక గురించి కొన్ని సీక్రెట్స్ ను రామాకు చెబుతుంది.

Janaki Kalaganaledu 12 august 2021 thursday 104 episode highlights

ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలా? వద్దా? అని తెగ టెన్షన్ పడుతున్నా. అమ్మకు చెప్పకుండా మంచి పని చేశారు. లేదంటే విష్ణు, మల్లికను ఇంట్లో నుంచి పంపిస్తుంది. వాడసలే అమాయకుడు. వాడి పరిస్థితి ఏమౌతుందో అని అమ్మ మంచం పడుతుంది. అందుకే ఈ విషయం అమ్మకు తెలియకూడదు.. అని మల్లిక దొంగబుద్ధి గురించి ఎవ్వరికీ చెప్పకూడదు అని అంటాడు రామా.

మీకు భార్యను అయినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవ్వడం మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువగా గర్వపడుతున్నాను.. అని చెప్పి.. రామా చెయ్యి తీసుకొని ముద్దు పెడుతుంది జానకి. దీంతో రామా పరవశంలో మునిగి తేలుతాడు. తను ముద్దు పెట్టిన చోటే తను కూడా ముద్దు పెడతాడు. అలాగే.. మైమరిచిపోతూ.. వెళ్లిపోతాడు.

Janaki Kalaganaledu 12 august 2021 thursday 104 episode highlights

కట్ చేస్తే.. తెల్లారగానే మల్లిక ఖార్ఖానా నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. అత్తయ్య గారూ అత్తయ్య గారూ అంటూ తెగ ఆవేశపడుతూ ఇంట్లోకి వెళ్తుంది. ఎక్కడున్నారండి.. త్వరగా రండి.. అంటూ తెగ అరుస్తుంది. ఎందుకు పొద్దున్నే అలా కేకలు పెడుతున్నావు. ఏం జరిగింది అంటే. అయిపోయింది.. అత్తయ్య గారు. మీ నమ్మకం అంతా గోదాట్లో కొట్టుకుపోయింది. రాత్రి సరిగ్గా 11.45 నిమిషాలకు బావగారు ఖార్ఖానాకు వచ్చారు. బావ గారు జానకిని కలిసి తనతో చాలాసేపు మాట్లాడారు.. అనగానే జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అంటుంది. అవును అత్తయ్య గారు.. మిమ్మల్ని రామా నట్టేట ముంచారు. బావ గారిని పిలిచి నిలదీయండి.. అనగానే.. రాత్రి నుంచి ఈ అమ్మాయి అలాగే ప్రవర్తిస్తోంది అంటూ జ్ఞానాంబకు తన భర్త సర్దిచెబుతాడు. కల కని ఉంటుంది అని చెబుతాడు. దీంతో మల్లిక మాట వినకుండా జ్ఞానాంబ తనను తిట్టి వెళ్లిపోతుంది.

Janaki Kalaganaledu 12 august 2021 thursday 104 episode highlights

మల్లిక అమ్మ గారు.. మీ కలలోకి మీ ఆయన రావాలి కానీ.. రామా గారు రావడం ఏంటండి.. అని చికిత అడుగుతుంది మల్లికను. నా మాట నమ్మడం లేదు కదా. ఇవాళ కాకపోతే.. రేపు పట్టిస్తాను.. అంటూ శపథం చేస్తుంది మల్లిక.

Janaki Kalaganaledu 12 august 2021 thursday 104 episode highlights

కట్ చేస్తే.. వదిన కోసం రామా చెల్లెలు క్యారేజ్ తీసుకెళ్తున్నట్టు రామా స్వీట్ షాపుకు వచ్చి చెబుతుంది. అన్నయ్య.. వదినకు క్యారేజ్ తీసుకెళ్తున్నా. వదినకు ఏవైనా పర్సనల్ విషయాలు చెప్పాలా? అంటే రాత్రే కలిశాను కదా అంటాడు. హా.. కలిశావా? అంటే.. కాదు కాదు.. స్వీట్లు ఎలా చేయాలో.. ముందే చెప్పాను అంటున్నా.. అంటూ సర్దిచెప్పుకుంటాడు. నీ మనసులో వదిన మీద ఉన్న ప్రేమను చెప్పమంటావా? చెప్పు అంటుంది అతడి చెల్లెల్లు. దీంతో ఒక స్వీట్ సగం తిని.. ఎంగిలి చేసి తన చెల్లెలుకు ఇస్తాడు.

Janaki Kalaganaledu 12 Aug Today Episode : జానకికి సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించిన వెన్నెల

కట్ చేస్తే.. ఉదయాన్నే లేచి స్వీట్లు తయారు చేస్తుంటుంది జానకి. జానకి కష్టపడటం చూసి ఏడుస్తుంది వెన్నెల. నువ్వెప్పుడు వచ్చావు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు. కళ్లలో ఆ నీళ్లు ఏంటి? అంటుంది. నువ్వు అబద్ధం ఆడవని.. ఇంట్లో అమ్మతో సహా.. అందరికీ తెలుసు. చేయని తప్పుకు నువ్వు ఇలా శిక్ష అనుభవిస్తుంటే అందరం బాధపడుతున్నాం వదిన. అంటే.. అత్తయ్య గారు నన్ను ఇక్కడికి పంపించినందుకు నేనేమీ బాధపడటం లేదు. కొంచెం కష్టమైనా ఈ పనులన్నీ నేర్చుకోవాలి కదా.. అని జానకి చెబుతుంది.

Janaki Kalaganaledu 12 august 2021 thursday 104 episode highlights

అమ్మ నీకోసం టిఫిన్ పంపించింది.. పదా తిందువు కానీ.. అని అంటుంది వెన్నెల. ముందు టిఫిన్ చేయి వదిన.. తర్వాత నీకో సర్ ప్రైజ్ ఉంది అని చెబుతుంది. సర్ ప్రైజ్ ఏంటి వెన్నెల.. అంటుంది. ముందు నువ్వు టిఫిన్ తిను.. అంటుంది. బాక్స్ తెరిచి చూసేసరికి.. ఖాళీ టిఫిన్స్ ఉంటాయి. అమ్మ టిఫిన్ పెట్టడం మరిచిపోయిందా? అని షాక్ అవుతుంది వెన్నెల. ఏం కాదు లే.. నేను త్వరగా భోజనం చేస్తానులే అంటుంది జానకి. ఇంతకీ సర్ ప్రైజ్ ఏంటి? అంటుంది. అన్నయ్య ఎంగిళి చేసి పంపించిన మైసూర్ పాకును అందిస్తుంది. దాన్ని చూస్తూ మురిసిపోతుంది జానకి. నాకు ఇదే టిఫిన్. నాకు ఈ టిఫిన్ చాలు. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి.. ఆ మైసూర్ పాకును ఎంతో ప్రేమతో తింటుంది జానకి.

కోడళ్లు అంటే ఇంకా పాతకాలం లాగానే ఉంటారా? మారాలి.. అప్ డేట్ అవ్వాలి. కోడళ్లు.. అత్తలకు ఎదురు తిరగాలి.. అంటూ ఏదేదో నూరిపోస్తుంది మల్లిక. ఎలాగైనా జానకిని బుక్ చేయడం కోసం మళ్లీ ఏదో ప్లాన్ వేస్తుంది. తర్వాత ఓ పిల్లాడు ఖార్ఖానాకు వచ్చి.. జానకికి ఒక చీర, నగలు ఇచ్చి.. అన్నయ్య ఇచ్చాడు.. ఇవి కట్టుకొని రెడీగా ఉండు. సాయంత్రం 5 గంటలకు వస్తా అన్నాడు అని చెబుతాడు. అత్తయ్య చీర ఎందుకు ఇచ్చాడు. నగలు కూడా నావి కాదు కదా.. అని అనుకుంటుంది జానకి. అయితే.. ఇది మల్లిక వేసిన ఎత్తుగడ అని తెలుసుకోలేకపోతుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. శుక్రవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago