Karthika Deepam 12 Aug Today Episode : కార్తీక దీపం 12 ఆగస్టు 2021, గురువారం ఎపిసోడ్ 1116 రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ.. నాన్నను ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు అమ్మా. చెప్పు అమ్మా. ఏం మాట్లాడవు ఏంటి.. అని ఇద్దరు పిల్లలు దీపను నిలదీస్తారు. నాన్న మంచివారే కదా.. అందరూ ఉండి కూడా ఎవ్వరూ ఎందుకు ఆపలేదు. నాన్న ఎప్పుడు వస్తారు.. అసలు ఏం చెప్పడం లేదు ఎందుకు.. అంటే తెలియదు అమ్మా.. అని సమాధానం ఇస్తుంది దీప. తెలియదా? తెలియదు అంటే ఎలా అమ్మా. రేపు వస్తాడా? ఎల్లుడి వస్తాడా? అసలు పోలీసులు వదిలిపెట్టరా? నాకు భయంగా ఉంది. నాన్న లేకుండా మేము ఉండలేం.. అంటారు పిల్లలు. వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. వారణాసి ఆటోలో వెళ్లి వద్దామా? అంటే.. ఇప్పుడు వద్దు. ముందు మీరిద్దరు వెళ్లి భోం చేయండి అని అంటుంది దీప. నేను ఏం చెప్పగలను. నా జాతకమే ఇంత. నేను ఏం చేయలేను.. అంటూ బాధపడుతుంది దీప.
కట్ చేస్తే.. కార్తీక్ డాడీ తెగ బాధపడుతుంటాడు. వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అయిపోయింది.. అంతా అయిపోయింది.. నా పెద్ద కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇంత డబ్బు, పలుకుబడి ఉండి కూడా ఏం చేయలేకపోయాం. వాడు డాక్టర్. వాడికి ప్రాణం పోయడం తప్ప.. ప్రాణం తీయడం తెలియదు. వాడు ఇద్దరు బిడ్డలకు తండ్రి అయినా సరే.. ఇప్పటికీ తల్లి తిట్టినా పడతాడు. నేను తిట్టినా పడతాడు. చివరకు ఆదిత్య తిట్టినా పడతాడు.. అని ఆదిత్యతో అంటాడు.
మనమే ఇంత బాధపడుతుంటే.. అక్కడ వదిన ఎంత బాధపడుతుందో అని ఆదిత్య అంటాడు. అసలు.. అక్కను తీసుకురావాల్సింది అని అంటుంది ఆదిత్య భార్య శ్రావ్య. నేను పొద్దున్నే దీప అక్క దగ్గరికి వెళ్లి క్యారేజ్ తీసుకెళ్లి.. అత్తయ్య వచ్చేదాక అక్కడే ఉంటా.. అంటుంది. ఉదయమే దీప దగ్గరికి వెళ్లి.. అక్కా రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? పిల్లలు ఏరి? అంటూ వెతుకుతుంది. ఏం మాట్లాడదు దీప. నువ్వు ఇంత దిగులు పడకు. పిల్లలు బెదిరిపోతారు. మీరిద్దరి కోసం పిల్లలు బెంగపెట్టుకుంటారు. బాధపడకు అక్క. అత్తయ్య ఇవాళ వస్తున్నారు కదా.. ఎలాగైనా బావ గారిని విడిపిస్తారు అంటుంది శ్రావ్య.
అత్తయ్య వచ్చి మాత్రం ఏం చేస్తారు శ్రావ్య.. అయినా అన్నింటికి నేనే కారణం. మోనిత, అంజి వీడియో నేనే డాక్టర్ బాబుకు చూపించా. వీడియో చూసిన తర్వాత ఇద్దరం కలిసి రోషిణి మేడమ్ దగ్గరికి వెళ్లి ఆ వీడియో చూపిద్దాం అనుకున్నాం. ఆ వీడియోలో జీర్ణించుకోలేని విషయం తెలుసుకున్న డాక్టర్ బాబుకు చెమటలు పట్టాయి. నేను మంచి నీళ్లు తీసుకొచ్చేలోపే ఆయన వెళ్లిపోయారు. మోనితనే చంపేందుకు వెళ్తున్నారని నాకు తెలియదు. ఆదిత్య ఫోన్ చేశాక కానీ నాకు ఆఆలోచన రాలేదు. ఫోన్ చేసినా కూడా ఎవరో చనిపోయారు.. అక్కడికి వెళ్తున్నా అని చెప్పారు. మళ్లీ చేస్తే కట్ చేశారు. అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. డాక్టర్ బాబు అక్కడికి వెళ్లారు. నేను చూపించిన వీడియో వల్లనే ఇదంతా జరిగింది.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప.
ఇంతలో పిల్లలు లేస్తారు. ఏమైంది అమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా. నాన్న ఇక రారా? అంటూ పిల్లలు అడుగుతారు. ఏం కాదు. ఈ రోజు నానమ్మ వస్తుంది.. నాన్నను విడిపిస్తుంది అని శ్రావ్య పిల్లలకు నచ్చజెబుతుంది. సరే.. మీరు వెళ్లండి.. మీరు ఫ్రెష్ అయి వస్తే.. మీకోసం టిఫిన్ తీసుకొచ్చా అని అంటుంది శ్రావ్య.
కట్ చేస్తే జైలులో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో ఏసీపీ మేడమ్ అక్కడికి వస్తుంది. కానిస్టేబుల్ ఇతడిని నా క్యాబిన్ కు తీసుకురండి.. అని అంటుంది. ఆయన వచ్చాక.. ఎందుకు నవ్వు వచ్చింది.. అని అడుగుతుంది రోషిణి. నేను వస్తుంటే నన్ను చూసి ఎందుకు నవ్వావు అంటుంది రోషిణి. నాకు అసలే ఈగో ఎక్కువ అంటుంది రోషిణి. ఎందుకు మేడమ్ ఈగోలు గట్రా.. అసలే మీకు రోజూ ఈ మర్డర్లు, కొట్లాటలు చూస్తుంటారు. నన్ను చూడండి.. ఎంత ప్రశాంతంగా, హాయిగా ఉన్నానో.. వస్తాను మేడం అని అంటాడు కార్తీక్.
ఇంతలోనే కార్తీక్ మమ్మీ సౌందర్య పోలీస్ స్టేషన్ కు వస్తుంది. మమ్మీ ఎప్పుడు వచ్చావు మమ్మీ.. స్వప్ప బాగుందా? అని అడుగుతాడు. బాధపడకు మమ్మీ. దీపను, పిల్లలను ఇంటికి తీసుకవెళ్లు. దీపను నువ్వే చూసుకోవాలి. దీపకు నువ్వే ధైర్యం చెప్పాలి. డాడీ వేసుకునే మందులు అశ్రద్ధ చేయొద్దని చెప్పు.. అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత సౌందర్య.. ఏసీపీ మేడమ్ దగ్గరకు వెళ్తుంది. మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది ఏసీపీ. వెంటనే బ్యాగులోనుంచి గన్ తీసి.. టేబుల్ మీద పెట్టి.. సరెండర్ అవ్వడానికి వచ్చాను. హత్యకు ఉపయోగించిన గన్ ఇదే. నాకొడుకుకు నేనంటే చాలా ఇష్టం. అందుకే.. నేనే చేసిన నేరాన్ని వాడి మీద వేసుకున్నాడు. నన్ను అరెస్ట్ చేసి మావాడిని రిలీజ్ చేయండి.. అని అడుగుతుంది సౌందర్య.
దీంతో ఒకపని చేయండి. మీరు వచ్చి నా చైర్ లో కూర్చోండి. నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. ప్లీజ్ కూర్చోండి.. అంటూ హేళనగా మాట్లాడుతుంది ఏసీపీ. మీకొడుక్కి మీమీద ఉన్న ప్రేమ కంటే.. మీకే మీ కొడుకు మీద ప్రేమ ఎక్కువనుకుంటా. అందుకే.. అతడు చేసిన నేరాన్ని మీ మీద వేసుకుంటున్నారు.. అనగానే సౌందర్య లేచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంద. కూర్చోండి.. మీకు ఒకరి మీద మరొకరికి ఎంత ప్రేమో.. నాకు కూడా నా డ్యూటీ మీద అంతే ప్రేమ. మీరు రెండు గంటల క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగారు. సరాసరిగా దీప దగ్గరికి వెళ్లి అక్కడ కారులో ఉన్న ఈ గన్ ను తీసుకొని వచ్చారు. దీపను పలకరించకుండానే మీరు ఇక్కడికి వచ్చారు. మోనిత మర్డర్ జరిగింది నిన్న. నిన్న జరిగిన మర్డర్ ను మీరెలా చేశారో మీ తల్లి ప్రేమకే తెలియాలి.. అని అంటుంది రోషిణి మేడమ్.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.