Janasena : పవన్ కళ్యాణ్ కు భారీ షాక్? పార్టీకి కీలక నేత గుడ్ బై
Janasena : అసలే ఓవైపు తిరుపతి ఉపఎన్నిక. ప్రధాన పార్టీలన్నీ తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ సీనియర్ నేత భారీ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి గాంగాధరం మూడు పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే.. పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా ప్రపంచం వేరు.. రాజకీయ ప్రపంచం వేరు… ఈ రెండింటికి ఏమాత్రం తేడా లేకుండా మీరు వ్యవహరిస్తున్నారు. అందుకే… నాలాంటి సీనియర్లు మీతో పనిచేయలేరు. నేను మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో, ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు మీద ఉన్న అభిమానంతో జనసేన పార్టీలో చేరాను. నిజానికి పవన్ కళ్యాణ్.. పార్టీలో కష్టపడే వాళ్లను పట్టించుకోవడం లేదు. కొందరికే గౌరవం ఇస్తున్నారు. నేను పార్టీలో చేరినప్పుడు నన్ను బాగానే చూసుకున్నారు.. కానీ తర్వాత తీసి పక్కన పడేశారు… అని మాదాసు లేఖలో పేర్కొన్నారు.
Janasena : జనసేన పార్టీ నిర్మాణంపైనే పవన్ ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు
ఒక పార్టీ అంటే పెట్టగానే కాదు.. దాని నిర్మాణం కూడా చాలా ముఖ్యం. పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. పార్టీకి కమిటీలు లేవు… పార్టీ విధివిధానాలు లేవు.. పార్టీ సభ్యత్వాలు లేవు.. పొత్తుల విషయంలోనూ పార్టీ నేతలతో చివరి నిమిషం వరకు పవన్ చర్చించరు. పార్టీలోని సీనియర్లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వరు. కొత్తగా వచ్చిన నేతలకు మాత్రం చాలా ఫ్రీడమ్ ఇస్తారు. 2019 ఎన్నికల తర్వాత అయినా మీరు పార్టీ నిర్మాణంపై, పార్టీ భవిష్యత్తుపై దృష్టి పెడతారని భావించాం. కానీ.. అసలు పార్టీలోనే ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు వామపక్షాలతో కలిసి నడిచారు… ఎన్నికల తర్వాత బీజేపీతో జతకట్టారు. అసలు.. బీజేపీతో ఎందుకు కలిసి నడుస్తున్నారో పార్టీలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.. అని గంగాధరం స్పష్టం చేశారు.
ఇంకా ఆయన ఏమన్నారో ఈ లేఖలో చదవండి…
JanaSena కి Political Affairs Commitee
"మాదాసు గంగాధరం" రాజీనామా
దయచేసి Last Paragraph చదవండి ???? pic.twitter.com/4mnI5q4l5E
— YsJagan4Vizag (@Yzagnani) April 11, 2021