Pawan kalyan : ఒక్కసారిగా ఏపీలో మారబోతున్న రాజకీయాలు? జగన్ తో పవన్ కళ్యాణ్ భేటీ?
Pawan Kalyan : ఏపీ సీఎం వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఏపీలో మాంచి దమ్మున్న నాయకులే. ఎవ్వరూ తక్కువ కాదు. కాకపోతే.. జగన్ కన్నా పవన్ కు కాస్త పాపులారిటీ తక్కువ. జగన్ కు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. పవన్ కు లేదు. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ పొద్దున లేస్తే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వాళ్లే. కానీ.. వీళ్లిద్దరు ఒకసారి కలిస్తే ఎలా ఉంటది. అదే త్వరలో జరగబోతుందట. ఇప్పటి వరకు వీళ్లిద్దరు ఎదురుపడి మాట్లాడుకున్నది లేదు. అన్నీ మీడియా ద్వారా, పరోక్షంగా, సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకోవడం తప్పితే.. కలిసి మాట్లాడిన దాఖలాలు అయితే లేదు.
కానీ.. త్వరలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ ను కలవబోతున్నారట. ఇద్దరు కలిస్తే ఇంకేమన్నా ఉందా? రాజకీయాలు ఒక్కసారిగా తారుమారు కావు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి కలిచివేసి తప్పని పరిస్థితుల్లో సీఎం జగన్ ను కలవడానికి పవన్ సమాయత్తం అవుతున్నారట.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎక్కువగా ఉందని.. అలాగే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను పవన్ కోరనున్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan : విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి సీఎంతో చర్చ
అలాగే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశం అవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా సీఎం జగన్ తో పవన్ చర్చించనున్నారట. అయితే.. పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ ను ఎప్పుడు కలుస్తారు… అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. ఖచ్చితంగా పవన్ మాత్రం జగన్ ను కలిసి.. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించి.. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని జగన్ ను కోరుతారట.