Home » National » January 2022 04 Covid And Omicron Cases In India Today
National

Omicron : బ్రేకింగ్‌.. దేశంలో కరోనా విజృంభన.. కొనసాగుతున్న ఒమిక్రాన్ ఉద్ధృతి.. నేడు ఎన్ని కేసులంటే..!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 4, 2022 9:44 am
Advertisement

Omicron : భారత్‌ ను ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల కలవర పెడుతోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 37 వేల 379 కేసులు నమోదు కాగా.. 124 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

తాజాగా 11, 007 మంది మహమ్మారి భారీ నుంచి కోలుకోగా… దేశంలో ప్రస్తుతం 1, 71, 830 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రోజు 100కు పైగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892 కు చేరింది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

january 2022 04 Covid and omicron cases in India today

Advertisement

అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి