Home » Andhra Pradesh » Jc Prabhakar Reddy Fires On Anantapur Dist Collector Nagalakshmi
andhra pradesh

JC Prabhakar Reddy : ఒక్కసారిగా లేడీ కలెక్టర్ పై సీరియస్ అయిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: February 23, 2023, 8:20 pm
Advertisement

JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన లేడీ కలెక్టర్ నాగలక్ష్మి పై చాలా సీరియస్ గా ప్రవర్తించడం జరిగింది. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తో జెసి ప్రభాకర్ రెడ్డి భేటీ అయి పేపర్లు విసిరేసి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఐఏఎస్ పనికి నువ్వు పనికిరావు అంటూ ఆమెను దూషించారు. బి కేర్ఫుల్ అంటూ హెచ్చరించారు.

Advertisement

JC Prabhakar Reddy Fires On Anantapur Dist Collector Nagalakshmi

ఇదే సమయంలో అడ్డుపడటానికి వచ్చిన గన్ మెన్ పై ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం బయట జెసి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరింత సీరియస్ అయ్యారు. కలెక్టర్ తనని గోగో అని అన్నట్లు జెసి ప్రభాకర్ ఆరోపించారు. ఓ గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించి భూమి విషయంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు విషయంలో సరిగ్గా పట్టించుకోవడంతో…

Advertisement

JC Prabhakar Reddy Fires On Anantapur Dist Collector Nagalakshmi

సీరియస్ కావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అయినా తననే వెళ్ళు వెళ్ళు అని.. కలెక్టర్ అనటం పట్టి చూస్తే ఇక్కడ సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏం చేస్తావ్ జైల్లో పెట్టిస్తావా అంటూ దానికి కూడా రెడీ అని.. పేర్కొన్నారు. భూ వివాదం విషయంలో పక్క ఆధారాలతో సహా.. ఫిర్యాదు చేసిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. నిలదీశారు. లేడీ కలెక్టర్ పై జెసి ప్రభాకర్ రెడ్డి ఒకసారిగా సీరియస్ కావటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి