Jobs in NIMS : హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి (నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో తాత్కాలిక ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య వివరాలు మీకోసం..రాష్ట్రంలో కొవిడ్ విజృంభిస్తున్నందున నిమ్స్ ఆస్పత్రిలో ఖాళీలను త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం అందులో సరైన్ స్టాఫ్ లేక డ్యూటీ డాక్టర్లతో పాటు రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ మేరకు వైద్యారోగ్యశాఖకు నివేదిక అందడంతో తాత్కాలిక ప్రతిపాదికన నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, భర్తీ విధానాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొంది.నిమ్స్‌లో మొత్తం 4 పోస్టులు ఉండగా.. అందులో సైంటిస్ట్-సి, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ నియామకం అత్యవసరం. విభాగం విషయంలో మెడికల్ జెనెటిక్స్, మోలెక్యులర్ జెనెటిక్స్, సైటోజెనెటిక్స్. అర్హతలు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/బీటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే నోటిఫికేషన్ సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ నెలకు రూ.25,000 నుంచి 75,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్ Nizams Institute of Medical Sciences, Punjagutta, Hyderabad, Telangana- 500082. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2022 గా నిర్ణయించారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
This website uses cookies.