Jogi Ramesh : నారా లోకేష్ ‘పిల్ల చేష్టలకు’ భయపడేది లేదు – జోగి వార్నింగ్

 Authored By sudheer | The Telugu News | Updated on :1 February 2026,9:40 pm

ప్రధానాంశాలు:

  •  Jogi Ramesh జోగి ఇంటికి నిప్పు .. లోకేష్ కు వార్నింగ్

  •  Jogi Ramesh : నారా లోకేష్ 'పిల్ల చేష్టలకు' భయపడేది లేదు : జోగి రమేష్ వార్నింగ్

Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో సెగలు పుట్టించే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ Nara Lokesh పై మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ TDP  శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి దారితీశాయి. మైలవరం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని ముట్టడించి, ఇంటిపైకి రాళ్లతో దాడికి దిగారు. ఇంతటితో ఆగకుండా కొందరు ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టడం, పెట్రోల్ బాంబులు విసిరారన్న ఆరోపణలు ఉద్రిక్తతను పరాకాష్టకు చేర్చాయి. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినప్పటికీ, ఆస్తి నష్టం భారీగానే సంభవించింది.

Jogi Ramesh : నారా లోకేష్ 'పిల్ల చేష్టలకు' భయపడేది లేదు - జోగి వార్నింగ్

Jogi Ramesh : నారా లోకేష్ ‘పిల్ల చేష్టలకు’ భయపడేది లేదు – జోగి వార్నింగ్

Jogi Ramesh మా ఇంటిపై ఎందుకు దాడి చేశారు ? – జోగి ఆవేదన

ఈ ఘటన పై జోగి రియాక్ట్ అయ్యారు. “నేనేం చేశానని ఈ దాడులు?” అటు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతూ, తనను రాజకీయంగా వేధించడమే కాకుండా భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. “అక్రమ కేసులతో ఇప్పటికే 83 రోజులు జైలులో పెట్టి వేధించింది చాలక, ఇప్పుడు మా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులు చేయిస్తారా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ నేరుగా నివాసాలపై దాడులు చేయడం అరాచక పాలనకు నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Jogi Ramesh నారా లోకేష్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ వార్నింగ్ !

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి జోగి రమేష్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. “నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తుంచుకో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తనపై ఇలాంటి ‘పిల్ల చేష్టలకు’ పాల్పడితే తాను భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ పరస్పర సవాళ్లు మరియు భౌతిక దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి