
Jr NTR big decision about next film
Jr NTR : ఇటు యంగ్ టైగర్ ఎన్టీయార్, అటు భారతీయ జనతా పార్టీ.. ఇలా ఇరువైపుల నుంచీ ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయం కావాల్సినంత ‘మేత’ని మీడియాకి అందిస్తోంది. జూనియర్ ఎన్టీయార్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకి బాహాటంగా మద్దతివ్వడం వల్ల జూనియర్ నందమూరి తారక రాముడికి అదనంగా కలిగే ప్రయోజనమూ ఏమీ లేదు. కాకపోతే, జూనియర్ నందమూరి తారక రామారావు వల్ల భారతీయ జనతా పార్టీకి చాలా లాభం వుంది. టీడీపీని చీల్చగల సత్తా ఎన్టీయార్‌కి వుందని బీజేపీ నమ్ముతోంది. టీడీపీ పగ్గాలు నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబానికి వచ్చేలా చేస్తే, టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైపోతుందనే భావనతో వుంది బీజేపీ. అలా చేయడం వల్ల ఏపీ రాజకీయాల్లో బలపడొచ్చన్నది బీజేపీ వ్యూహమట.
ఏదో జాతీయ స్థాయి అవార్డు జూనియర్ ఎన్టీయార్‌కి ఇచ్చేస్తే, తమకు రుణపడిపోతాడని బీజేపీ ఆశించడంలో వింతేముంది.? కానీ, అలాంటివాటికి జూనియర్ ఎన్టీయార్ పడిపోతాడా.? అంటే, ‘ఔను అనీ చెప్పలేం.. కాదు అనీ చెప్పలేం’ అన్నది మెజార్టీ అభిప్రాయం. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. బీజేపీకి ఒకవేళ జూనియర్ ఎన్టీయార్ మద్దతిస్తే, తెలుగు రాష్ట్రాల్లో వుండే అధికార పార్టీలతో ‘రాజకీయ పంచాయితీ’ని కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగానే, జూనియర్ నందమూరి తారక రాముడి సినిమా కెరీర్‌కి ఏమంత మంచిది కాదు.
Jr NTR Politics, BJP Mind Game.!
కానీ, జూనియర్ ఎన్టీయార్‌ని ఆల్రెడీ బీజేపీ వివాదంలోకి లాగేసింది. నిండా మునిగాక చలేంటి.? అన్నట్లు జూనియర్ ఎన్టీయార్ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోక తప్పదేమో.! నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాలు బీజేపీని ఎలా దేశంలో బలోపేతం చేస్తున్నాయో చూస్తున్నాం. రాజకీయాలు ఎంతలా భ్రష్టుపట్టిపోతున్నా.. వాటిని మరింత భ్రష్టు పట్టించేసి మరీ, బీజేపీ తనదైన రాజకీయాలు చేస్తోంది. ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి లాగడం కూడా అలాంటిదేనేమో.!.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.