CBN | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ బరిలో మాగంటి సునీత..కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ, టీడీపీ పోటీకి దూరం
CBN హైదరాబాద్ నగరంలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయంగా వేడి రాజుతోంది. ఇటీవల అకాలంగా మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానం ఖాళీ కావడంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
#image_title
బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలోకి
మాగంటి గోపీనాథ్ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. ఆయన సతీమణి మాగంటి సునీతను బరిలోకి దించి సానుభూతి పూరిత ఓట్లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం మరో రెండు రోజుల్లో తన అభ్యర్థిని ప్రకటించనుంది. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటోంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోని కొన్ని నియోజకవర్గాల్లో మంచి ఓట్లు రాగా, జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తే తమ హోదాను చాటుకునే అవకాశముందని భావిస్తోంది. అయితే ఇంకా బీజేపీ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఒకవైపు టీడీపీ కూడా పోటీ చేస్తుందన్న ఊహాగానాలు చోటు చేసుకోగా, తాజా సమాచారం ప్రకారం టీడీపీ ఉప ఎన్నికలో పోటీ చేయదని స్పష్టత వచ్చింది.చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ..“తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఏపీలో సుస్థిరమైన పొత్తు ఉన్నందున, తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయలేం. బీజేపీ అభ్యర్థిని మద్దతు కోరితే అండగా ఉండాలి, లేదంటే తటస్థంగా ఉండాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇవ్వబోము” అని స్పష్టం చేశారు.