Categories: News

Karthika Deepam 2 Today Episode: బోన్‌మ్యారో ట్విస్ట్‌తో కార్తీక్ ఆటలు..అత్తను నవ్వించిన ఫొటో వెనుక నిజం..!

Advertisement
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది. దొరికిపోతానేమో అన్న భయంతో జ్యోత్స్న లోపలలోపల కాలిపోతుంటే బయట మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తుంది. అదే సమయంలో అత్త సుమిత్రను నవ్వించాలనే ఉద్దేశంతో కార్తీక్ హాస్యంగా వ్యవహరిస్తూ పరిస్థితిని కంట్రోల్ చేయాలని చూస్తాడు. కానీ అసలు ట్విస్ట్ బోన్‌మ్యారో విషయంలోనే వస్తుంది. డాక్టర్ ఇచ్చిన సమాచారం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. సుమిత్ర శాంపిల్‌కు జ్యోత్స్న శాంపిల్‌కు మ్యాచ్ రావడం లేదని చెప్పడంతో ఇంట్లో సందేహాలు మొదలవుతాయి. చివరకు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అనే మాట బయటపడుతుందన్న సూచనతో వాతావరణం బరువెక్కుతుంది. ఈ నిజాన్ని ముందే ఊహించినట్టుగా కార్తీక్ బోన్‌మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం కాదు… కన్న కూతురు అంటూ జ్యోత్స్నకు గట్టి షాక్ ఇస్తాడు. కన్నతల్లి ప్రాణాలు కాపాడే అవకాశం వస్తే ఎవరైనా అదృష్టంగా భావిస్తారు. అలాంటప్పుడు జ్యోత్స్న ఎందుకు తప్పించుకోవాలని చూస్తుందన్న ప్రశ్న కార్తీక్ లేవనెత్తుతాడు. అదే సమయంలో దాసు మామయ్య కనిపించకపోవడం మరో పెద్ద మిస్టరీగా మారుతుంది.

Advertisement

Karthika Deepam 2 Today Episode

Karthika Deepam 2 Today Episode: దాసు మామయ్య మాయం..తాయిత్తు చెప్పిన రహస్యం

Advertisement

దాసు మామయ్య ఎక్కడా కనిపించకపోవడంతో కార్తీక్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని అంటాడు. అది విన్న వెంటనే జ్యోత్స్న గుండె జారిపోతుంది. ఇంకో రోజు చూసి కంప్లెయింట్ ఇస్తా అన్న కార్తీక్ మాటల్లోనే అనుమానం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా గార్డెన్‌లో దొరికిన తాయిత్తు కథను మరో మలుపు తిప్పుతుంది. మెడలో ఉండాల్సిన తాయిత్తు అక్కడ ఎలా దొరికింది? తెగిపోయిందా? లేక ఎవరో తెంపేశారా? రాత్రి నుంచి దాసు ఇంటికి కూడా వెళ్లలేకపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇవన్నీ ఉత్కంఠను పెంచుతాయి. పారు కూడా జ్యోత్స్న ప్రవర్తనపై డౌట్ పడుతుంది. జ్యోత్స్న మాత్రం మాటలతో కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కార్తీక్ ప్రశ్నలు పదునెక్కుతుంటాయి. నిజం బయటపడకుండా ఉండేందుకు జ్యోత్స్న ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితులు ఆమెకు వ్యతిరేకంగానే మారుతున్నాయి.

Karthika Deepam 2 Today Episode: అత్తను నవ్వించిన ఫొటో..చివర్లో నిలిచిన నిజం

ఇంట్లో టెన్షన్ పెరిగిపోతున్న వేళ సుమిత్ర మనసు మరింత బరువెక్కుతుంది. బ్లడ్ క్యాన్సర్ అన్న మాట విన్న తర్వాత తనలోని సంతోషాలన్నీ భయాలుగా మారిపోయాయని ఆమె బాధతో చెబుతుంది. జ్యోత్స్నపై తనకున్న ప్రేమను అయినా ఆమె నుంచి అదే ప్రేమ రాకపోవడాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తను కాసేపైనా నవ్వించాలని కార్తీక్ దీపతో కలిసి ఓ చిన్న ప్లాన్ చేస్తాడు. చిన్నప్పుడు ఆడపిల్లలా రెడీ అయిన తన పాత ఫొటోను సుమిత్ర ఫోన్‌కు పంపిస్తాడు. ఆ ఫొటో చూసి సుమిత్రతో పాటు దశరథ, పారు, శివనారాయణ, జ్యోత్స్న కూడా నవ్వుతారు. ఇంట్లో కొద్దిసేపు అయినా నవ్వుల సందడి నెలకొంటుంది.

అయితే ఆ నవ్వుల వెనుక కూడా ఓ కథ ఉందని సుమిత్ర అంటుంది. ఈ ఫొటో వెనుక ఉన్న నిజం కూడా చెప్పాల్సిందే అని ఆమె చెప్పడంతో వాతావరణం మళ్లీ సీరియస్‌గా మారుతుంది. నిజం దాచకుండా బయటపెట్టాల్సిన సమయం వచ్చిందన్న సంకేతంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి జనవరి 20 ఎపిసోడ్‌లో బోన్‌మ్యారో ట్విస్ట్ దాసు మామయ్య మిస్టరీ అత్తను నవ్వించిన ఫొటో ఈ మూడు కలిసి రాబోయే ఎపిసోడ్స్‌లో పెద్ద తుఫాన్ ఖాయమని చెప్పకనే చెప్పాయి.

 

 

Recent Posts

Husband and Wife : భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే.. మరొకరు వ్యాపారం చేయాలంటున్న చంద్రబాబు

Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

10 minutes ago

Gold Rate Today On Jan 20th : దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం బంగారం ధర ఎంతంటే !!

ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…

1 hour ago

Patanjali Peendil Gold : దీర్ఘకాలిక నరాల నొప్పితో బాధ‌ప‌డుతున్నారా?..పతంజలి ‘పీడనిల్ గోల్డ్’తో నొప్పికి సులభ పరిష్కారం

Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…

2 hours ago

Viral News : నీ నీతి, నిజాయితీకి లాల్ సలాం.. చెత్తలో దొరికిన ₹45 లక్షల విలువైన బ్యాగ్‌ను పోలీసులకు అప్ప‌గింత‌..!

Viral News :  తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…

3 hours ago

Pomegranate Juice : గుండె ఆరోగ్యానికి దానిమ్మ రసంతో ఎన్ని లాభాలో తెలుసా..?

Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…

4 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 20 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

5 hours ago

Revanth Reddy : ఓర్నీ ఇదెట్టా.. టీడీపీపై రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌లు.. కీల‌క బాధ్య‌త అప్ప‌గించారా..!

Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం బహిరంగ…

13 hours ago

Viral Video : సమాజ బాధ్యత అంటే నీదే త‌ల్లి.. ఒక చేతిలో మాతృత్వం.. మరో చేతిలో విధి నిర్వహణ..!

Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…

14 hours ago